శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 29 నవంబరు 2016 (09:36 IST)

మహిళ పట్ల దురుసుగా ప్రవర్తించిన కానిస్టేబుల్.. మంగళసూత్రాన్ని తెంపేశాడు..

పోలీసులు ప్రజల పట్ల అమానుషంగా ప్రవర్తించాడు. పుట్లూరు మండలం చింతకుంటకు చెందిన ఒక మహిళకు ఏకరన్నర పొలం ఉంది. పొలం సమీపంలో తాడిపత్రి బ్రాంచి కెనాల్‌ ఉంది. ఈకెనాల్‌ నుంచి పుట్లూరు మండలంలోని మూడు చెరువులకు

పోలీసులు ప్రజల పట్ల అమానుషంగా ప్రవర్తించాడు. పుట్లూరు మండలం చింతకుంటకు చెందిన ఒక మహిళకు ఏకరన్నర పొలం ఉంది. పొలం సమీపంలో తాడిపత్రి బ్రాంచి కెనాల్‌ ఉంది. ఈకెనాల్‌ నుంచి పుట్లూరు మండలంలోని మూడు చెరువులకు తాగునీటి కోసం హెచ్చెల్సీ నీటిని సరఫరా చేస్తున్నారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా ఆ మహిళకు చెందిన చీనీ చెట్లు వాడుపట్టాయి. 
 
ప్రస్తుతం చీనీ ధర దాదాపు లక్ష రూపాయలు ఉంది. దీంతో పంటను రక్షించుకోవడానికి తప్పనిసరి పరిస్థితుల్లో అందరి మాదిరిగా తాడిపత్రి బ్రాంచి కెనాల్‌ నుంచి మోటార్‌ ద్వారా నీటిని పొలానికి వాడుకుంటోంది. అయితే నీటి అక్రమ వాడకాన్ని నివారించడానికి పోలీస్‌ శాఖ ఇద్దరు కానిస్టేబుళ్లను బందోబస్తుగా నియమించింది.
 
ఈ నేపథ్యంలో బందోస్తు నిర్వహిస్తున్న కానిస్టేబుళ్లకు చీనీ తోటకు నీటిని వాడుకుంటున్నా మహిళ కనిపించింది. వారు ఆమె వద్దకు వెళ్లి నీటి అక్రమ వాడకంపై గద్దించారు. ఆమె పరిస్థితి వివరించినా వినకుండా కేసులు పెడతామని బెదిరించడంతో పాటు మరో కానిస్టేబుల్ వారిస్తున్నా పట్టించుకోకుండా ఆమె మెడలోని తాళి బొట్టును చేతిలోకి తీసుకుని లాగడంతో గొలుసు తెగిపోయింది.