శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 22 ఆగస్టు 2016 (17:05 IST)

నయీమ్ ఇంట్లో మహిళ మృతదేహం.. 33 మంది అరెస్ట్, రూ.143 కోట్లు స్వాధీనం

గ్యాంగ్‌స్టర్ నయీమ్ పాల్పడిన అరాచకాలు దారుణం. తాజాగా నయీం చేసిన మరో దారుణం వెలుగులోకి వచ్చింది. నయీమ్ నివాసంలో ఓ మహిళ మృతదేహాన్ని సోమవారం నార్సింగ్ పోలీసులు వెలికితీశారు. ఈ మృతదేహం మూడేళ్ల క్రితం నయీం

గ్యాంగ్‌స్టర్ నయీమ్ పాల్పడిన అరాచకాలు దారుణం. తాజాగా నయీం చేసిన మరో దారుణం వెలుగులోకి వచ్చింది. నయీమ్ నివాసంలో ఓ మహిళ మృతదేహాన్ని సోమవారం నార్సింగ్ పోలీసులు వెలికితీశారు. ఈ మృతదేహం మూడేళ్ల క్రితం నయీం చేతిలో దారుణ హత్యకు గురైన నస్రీన్‌గా పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.
 
అనంతరం సిట్ అధికారులు మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటివరకు నయీమ్ కేసులో 33 మందిని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. అలాగే రూ.143 కోట్లు స్వాధీనం చేసుకున్నామన్నారు.. ప్రాథమిక దర్యాప్తును మరో మూడు రోజుల్లో పూర్తి చేస్తామని తెలిపారు.
 
ఇదిలా ఉంటే.. నయీమ్‌ బాధితులకు 100 శాతం న్యాయం చేస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ భరోసా ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రముఖ వ్యాపారావేత్తలు, బడా నిర్మాతలు ఇంకా ఎంతోమందిని నయీమ్ బెదిరించి డబ్బులు కొట్టేసిన నేపథ్యంలో.. గుంజుకున్న డబ్బులు, అన్యాయంగా రిజిస్ట్రేషన్‌ చేసిన భూములు తిరిగిస్తామని బాధితులకు ధీమా ఇచ్చారు. నయీమ్‌ను పోషించిన వాళ్లే సీబీఐ విచారణ వేయాలంటున్నారని ఆయన ఆరోపించారు. 
 
శాంతిభద్రతల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని, ఎవరు నేరం చేసినా శిక్షపడక తప్పదని కేసీఆర్‌ హెచ్చరించారు. హైకోర్టు విషయంలో కేంద్రం, సుప్రీం చీఫ్‌ జస్టిస్‌ హామీ మేరకు వేచి చూస్తున్నామని సీఎం తెలిపారు.