శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 22 జులై 2014 (12:14 IST)

పోలీసులనే నవ్వించిన దొంగ: చెత్త కుండీని తీసుకెళ్లాడట!

ఏటీఎమ్ దోపిడీకి ఓ దొంగ చేసిన ప్రయత్నాలు సీరియస్‌గా ఉండే పోలిసులకి కూడా కడుపారానవ్వు తెప్పించాయి. దోమలగూడలోని వడ్డెర బస్తీకి చెందిన 20 ఏళ్ల యేసు యాదవ్ ఓ చిల్లర దొంగ. అయితే సీరియస్ దొంగతనాలు యేసుయాదవ్ ఎప్పుడు చెయ్యలేదు. గత శుక్రవారం విచిత్రంగా అతను ఒక ఏటీఎమ్‌ను చోరీ చేద్దామనుకున్నాడు. 
 
అయితే ఏటీఎమ్‌ల మీద అతనికి ఏ మాత్రం అవగాహన లేదు. శుక్రవారం రాత్రి దోమలగూడలోని స్టేట్ బ్యాంక్ ఆప్ హైదరాబాద్ ఏటీఎమ్‌లో చోరి చేద్దామని వెళ్లాడు యేసుదాస్. ఏటీఎం లోపలికి వెళ్లగానే పొరపాటున డ్రాప్ బాక్స్‌ను ఏటీఎం అనుకుని పెద్దరాయితో బద్దలుకొట్టాడు. దాంట్లోంచి కేవలం ఖాళీ కాగితాలే దొరకడంతో ఏం చెయ్యాలో అర్థం గాక...ఏటీఎం చుట్టూ చూడటం మొదలుపెట్టాడు. అలా ఏటీఎం లోపల చూస్తున్నప్పుడు అతనికి సీసీ కెమెరా కనపడింది. 
 
వెంటనే బయటకు వెళ్లిపోయి...ఒక నిమిషం తర్వాత తన టి షర్ట్‌ని ముఖానికి కప్పుకుని మళ్లీ వచ్చాడు...ఈసారి పెద్దరాయితో ఏటీఎం మెషీన్‌ను బద్దలుకొట్టాలని రెండు నిమిషాల పాటు ప్రయత్నించాడు యేసుయాదవ్. అయితే ఎంతకీ ఏటీఎం మెషీన్ బద్దలుకాకపోవడంతో...ఆఖరికి దిగాలుగా ఉత్త చేతులతో వెళ్లడం ఎందుకని, ఏటీఎంలో ఉన్న వేస్ట్ బాస్కెట్ ను తీసుకెళ్లాడు.
 
బ్యాంకు అధికారుల కంప్లైట్ తో చిక్కడపల్లి పోలీసులు రంగంలోకి సిసిటీవి పుటేజ్ సహాయంతో యేసుదాసును అరెస్ట్ చేశారు. సీసీటీవి పుటేజ్‌లో ఏటీఎం‌ను చోరి చెయ్యాడానికి యేసుయదవ్ పడిన ఆపసోఫాలు చూసి పోలీసులు కూడా మనసారా నవ్వుకున్నారు. తాను ఏటీఎం మెషీన్‌ను ఎప్పుడు వాడలేదని...లోపల డబ్బులు ఎక్కడ ఉంటాయో కూడా తనకు తెలియదని యేసుదాసు పోలీసులకు విచారణలో చెప్పాడు.