శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ESHWAR
Last Updated : సోమవారం, 28 జులై 2014 (12:04 IST)

బెజవాడలో ఇళ్లు కోసం కొందరు.. వ్యాపారం కోసం మరి కొందరు..

ఆంధ్రప్రదేశ్ రాజధానిపై ఇప్పటికీ స్పష్టత రానప్పటికీ నాయకులందరూ విజయవాడ వైపు పరుగులు తీస్తున్నారు. ఇప్పటికే వివిధ పార్టీలకు చెందిన నాయకులు విజయవాడలో స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకునేందుకు అనువైన గృహాల కోసం వెతుకుతున్నారు. మంత్రుల అనుయాయులను ఇదే వేటలో ఉన్నారు. ఇప్పటికే జగన్ మోహన్ రెడ్డి బెంజి సర్కిల్‌లో బహుళ అంతస్తుల బిల్డింగ్‌ను ఓకే చేశారట.
 
ఇందులోభాగంగా ఉప ముఖ్యమంత్రులు కేఈ కృష్ణమూర్తి విజయవాడలోని పిన్నమనేని ఆస్పత్రి పరిసరాలల్లో ఒక ఇంటిని ఖరారు చేసుకోగా నిమ్మకాయల చినరాజప్ప బందరు రోడ్డులో రెండు అంతస్తుల భవానాన్ని అద్దెకు తీసుకున్నట్టు సమాచారం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసం కోసం తమ్ముళ్లు వెతుకుతున్నా అనువైనది ఇంకా దొరకలేదు. 
 
ఇక పీసీసీ మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, మాజీ మంత్రులు వట్టి వసంత కుమార్, ఆనం సోదరులు కూడా ఇళ్ల అన్వేషణలో పడ్డారు. ఇలా కొందరు నేతలు ఇళ్లు వెతుక్కునే పనిలో ఉంటే మరి కొందరు నేతలు విజయవాడ, గుంటూరు పరిసరాలలో పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ వ్యాపారంలో బిజీగా ఉన్నారంట.