Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఒకే ఒక్క పిలుపుతో రెబల్ ఫ్యాన్స్ విజయవంతం చేశారు...

మంగళవారం, 3 అక్టోబరు 2017 (20:55 IST)

Widgets Magazine
swachh bharat

ఒకే ఒక్క పిలుపుతో ఉద్యమ స్థాయిలో ఉరకలెత్తి ఉభయ రాష్ట్రాలలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మా అభిమానులందరికి నా తరఫున, మా ప్రభాస్ తరుపున హృదయపూర్వక కృతజ్ఞతలు అన్నారు రెబెల్ స్టార్ కృష్ణంరాజు. అక్టోబర్2, గాంధీ జయంతి సందర్భంగా ఉభయ రాష్ట్రాలలోని తమ అభిమానులకు స్వచ్ఛ భారత్  కార్యక్రమాలు నిర్వహించండి అంటూ రెబెల్ స్టార్ కృష్ణంరాజు, యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ట్విట్టర్, ఫేస్ బుక్‌లలో చేసిన ఒకే ఒక్క పోస్టింగ్‌కు ఉద్యమ స్థాయిలో స్పందించి అన్ని ప్రధాన నగరాలలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని విజయవంతగా నిర్వహించారు రెబెల్ ఫాన్స్. 
 
ఈ సందర్భంగా తమ అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ "మా పిలుపుకు స్పందించి తమ స్వచ్చమైన మనసుతో స్వచ్ భారత్ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన మా అభిమానులు అందరికి కృతజ్ఞతలు. స్వచ్చ భారత్ అనేది ఒక నిరంతర ప్రక్రియ. అది మన దైనందిన జీవితంలో ఒక భాగం వంటిది. జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఈ మహత్తర కార్యక్రమానికి పునరంకితమవ్వడమే కాకుండా ఏడాది పొడుగునా మా అభిమానులు ఇందులో నిరంతర భాగస్వాములు అవ్వడం చాలా ఆనందాన్ని కలిగిస్తోంది. 
 
మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడి గారు ఇచ్చిన పిలుపు మేరకు స్వఛ్ భారత్‌ను విజయవంతం చేయడం మన అందరి కర్తవ్యం. తన స్వచ్ఛమైన మనసుతో దేశమంతా స్వచ్చంగా ఉండాలన్న లక్ష్యంతో మోడీ గారు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆయన ఆశయానికి అనుగుణంగా నేను, ప్రభాస్ ఇచ్చిన పిలుపుకు స్పందించిన అభిమానులకు పేరుపేరునా కృతజ్ఞతలు"అన్నారు. 
 
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ స్పందిస్తూ "స్వచ్ భారత్ విషయంలో ప్రధాని మోడీ గారు ఇచ్చిన పిలుపుకు యావత్ భారతదేశమే స్పందిస్తుంది. ఇక మా అభిమానుల స్పందన చూస్తుంటే చాలా ఆనందంగా, గర్వంగా అనిపిస్తుంది. అన్ని ప్రాంతాల అభిమానులు ఈ కార్యక్రమాన్ని గొప్పగా నిర్వహించారు. అందరూ తాము చేసిన స్వచ్ భారత్ ప్రోగ్రామ్ ఫోటోలను వాట్సాప్, ఫేస్‌బుక్‌లలో పంపిస్తున్నారు. నిన్న సాయంత్రానికే ఆ ఫొటోలు, వీడియోలు విపరీతంగా వైరల్ అయ్యాయి. నిజంగా ఇంత గొప్పగా, మనస్ఫూర్తిగా స్పందించిన మీ అందరికి చాలా చాలా థాంక్స్' అన్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

పవన్ కళ్యాణ్‌వి పిల్ల చేష్టలా..? ఏపీ ప్రజలు నవ్వుకుంటున్నారా?

సినిమాలు వేరు, రాజకీయాలు వేరు. సినిమాల్లో ఏది చేసినా చెల్లుబాటవుతుంటుంది. ఆట్టే పెద్దగా ...

news

తిరుమలలో దారుణం - పసిబిడ్డను చంపి బాత్‌రూంలో పడేశారు

ఆడ బిడ్డ పుట్టిందని కోపంతో తిరుమలలో చంటిబిడ్డను కర్కశంగా గొంతు నులిమి చంపేశారు ఎవరో కర్కశ ...

news

విషమించిన శశికళ భర్త నటరాజన్ ఆరోగ్యం... పెరోల్‌పై రానున్న చిన్నమ్మ

అన్నాడీఎంకే మాజీ ప్రధాన కార్యదర్శి శశికళ భర్త నటరాజన్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. గత ...

news

సీఎం చంద్రబాబు చేతుల మీదుగా 9న మెగా సీడ్ పార్క్‌కు శంకుస్థాపన, 650 ఎకరాలు...

అమరావతి : రూ.670 కోట్లతో ప్రపంచ స్థాయి మెగా సీడ్ పార్క్‌ను కర్నూల్ జిల్లాలో ఏర్పాటు ...

Widgets Magazine