శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , గురువారం, 27 ఏప్రియల్ 2017 (02:31 IST)

అమ్మ అంటే బాహుబలికైనా బిడియమే, భయమే మరి

దేశానికి ప్రధానినే అయినా ఒక అమ్మకు కొడుకునే అంటూ దివంగత ప్రధాని పీవీ నరసింహారావు ఒక సందర్భంలో చెప్పిన మాటలు దేశాన్ని ఇప్పటికీ ఉద్వేగంలో ముంచెత్తుతూనే ఉన్నాయి. ప్రస్తుతం యావత్ భారత దేశాన్ని తన సినీ మాయాజాలంతో సమ్మోహన పరుస్తున్న బాహుబలికి కూడా అమ్మ అంట

దేశానికి ప్రధానినే అయినా ఒక అమ్మకు కొడుకునే అంటూ దివంగత ప్రధాని పీవీ నరసింహారావు ఒక సందర్భంలో చెప్పిన మాటలు దేశాన్ని ఇప్పటికీ ఉద్వేగంలో ముంచెత్తుతూనే ఉన్నాయి. ప్రస్తుతం యావత్ భారత దేశాన్ని తన సినీ మాయాజాలంతో సమ్మోహన పరుస్తున్న బాహుబలికి కూడా అమ్మ అంటే భయమేనట. బాహుబలి-2లో తన నటన ఎలా ఉందని కన్నతల్లిని అడగడానికి సంకోచిస్తున్నాడట. ఆమెతో కలిసి సినిమాను చూడాలని కోరిక ఉంటున్నప్పటికీ ఆమె అభిప్రాయం ఎలా ఉందో వినడానికి మాత్రం భయపడుతున్నాడట.
 
యావత్ ప్రపంచాన్ని తన మాయాజాలంతో ఉర్రూతలూగిస్తున్న బాహుబలి-2 ఇంకొన్ని గంటల్లో థియేటర్ల ముందుకు రాబోతుంది. గురువారం ముంబైలో ప్రీమియర్ షోకు షెడ్యూల్ బుక్ చేశారు. అయితే ఈ సినిమాలో హీరోగా ప్రధాన పాత్ర పోషించిన ప్రభాస్ తన సినిమాను చూడాల్సిన అత్యంత ముఖ్యమైన తొలి వ్యక్తి, ఆమె కావాలని కోరుకుంటున్నారు. 
 
ఆమె ఎవరో తెలుసా ప్రభాస్ కన్నతల్లి తల్లి శివ కుమారి. అయితే తన ఫిల్మ్ మొదట తన తల్లినే చూడాలని భావిస్తున్న ప్రభాస్ మాత్రం ఆమెతో కలిసి సినిమా చూడటానికి సంకోచిస్తున్నాడట. దీనికి గల ప్రధాన కారణం వెనువెంటనే ఫీడ్ బ్యాక్ ను పొందడాన్ని ప్రభాస్ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడని తెలుస్తోంది.
 
బాహుబలి ది కన్‌క్లూజన్ పార్ట్ ను ఎంజాయ్ చేసే వారిలో తొలి వ్యక్తి తన అమ్మనే కావాలని ప్రభాస్ కోరుకుంటున్నారు. అదేవిధంగా తల్లి అభిప్రాయం కోసం కూడా ప్రభాస్ ఎంతో ఆసక్తి ఎదురుచూస్తున్నాడని తెలుస్తోంది. కానీ తన తల్లి పక్కనే కూర్చుని వెనువెంటనే ఫీడ్ బ్యాక్ పొందడానికి మాత్రం సంకోచిస్తున్నాడని ఫిల్మ్ వర్గాల టాక్. 
 
దేశవ్యాప్తంగా దాదాపు 8000 స్క్రీన్లపై బాహుబలి ది కన్‌క్లూజన్‌ను ప్రదర్శించబోతున్నారు. తెలుగుతో పాటు తమిళం, హిందీ, మలయాళంలో ఇది స్క్రీన్ల పైకి వస్తోంది. ప్రపంచం మొత్తం మీద చూస్తే దాదాపు 10 వేల థియేటర్లలో విడుదలవుతున్న బాహుబలి-2 భారతీయ చిత్రపరిశ్రమ కనీవినీ ఎరుగని రికార్డులను సృష్టించనుంది.