శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : బుధవారం, 28 జనవరి 2015 (09:14 IST)

ప్రకాశంలో హైటెక్ బస్సు దగ్ధం: ప్రయాణికుల అప్రమత్తం, సురక్షితం

ప్రకాశం జిల్లాలోని ఉలవపాడు మండలం చాగొల్లు వద్ద 5వ నెంబరు జాతీయ రహదారిపై మంగళవారం అర్థరాత్రి ప్రవీణ్ ట్రావెల్స్‌కు చెందిన హైటెక్ బస్సు దగ్ధమైంది. బస్సు వెనుక భాగం నుంచి పొగలు రావడాన్ని గమనించిన ప్రయాణికులు డ్రైవర్‌ను అప్రమత్తం చేయడంతో బస్సును నిలిపేశారు.
 
బస్సులోని ప్రయాణికులందరూ కిందిగి దిగిన కొద్ది సేపటికే మంటలు చెలరేగి బస్సు పూర్తిగా కాలిపోయింది. ప్రయాణికులంతా ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. ఆ బస్సు చెన్నై నుంచి హైదరాబాద్ వెళ్తుండగా చాగల్లు సమీపంలో ఈ ఘటన జరిగింది. 
 
ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 35 మంది ప్రయాణికులు ఉన్నారు. వేగంగా మంటలు అంటుకోవడంతో బస్సులోని ప్రయాణికుల సామాగ్రి మొత్తం కాలి బూడిదైంది. ఈ ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన నూతన దంపతులు నికేష్ హేమాద్రి, కళ్యాణికి చెందిన రూ.10 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, ల్యాప్‌టాప్, నగదు అగ్నికి ఆహుతైనట్టు వారు బోరున విలపిస్తూ చెప్పారు.