శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : ఆదివారం, 14 ఫిబ్రవరి 2016 (14:26 IST)

ప్రణీత కారు బోల్తా: స్వల్పగాయాలు.. అంబులెన్స్ పిలిపించిన వారికి?

అత్తారింటికి దారేది నటి ప్రణీత రోడ్డు ప్రమాదానికి గురైయ్యారు. ఈ ప్రమాదంలో నటి ప్రణీతకు స్వల్ప గాయాలయ్యారు. ఖమ్మం నుంచి హైదరాబాదుకు వెళ్తుండగా ఆమె కారు బోల్తాపడింది. నల్గొండ జిల్లా మోతె దగ్గర ఒక బైక్‌ను తప్పించబోయిన ఆమె కారు ప్రమాదానికి గురైంది. ఖమ్మంలో ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి హాజరై తిరిగివస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. 
 
ప్రమాదం జరిగిన ప్రాంతంలో రోడ్డు పనులు జరుగుతున్నాయి. అక్కడే ఉన్న ఏఈఈలు వెంటనే స్పందించి వెంటనే అంబులెన్స్‌ను పిలిపించి.. ప్రణీతను ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో ప్రణీత, ఆమె తల్లి, మరో ముగ్గురు స్వల్పంగా గాయపడ్డారు. ప్రస్తుతం తాము క్షేమంగా ఉన్నామని, తక్షణం స్పందించి అంబులెన్స్‌ను పిలిపించిన అధికారులకు కృతఙ్ఞతలు చెబుతున్నానని ప్రణీత ట్వీట్ చేసింది.