శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : ఆదివారం, 19 అక్టోబరు 2014 (13:25 IST)

విశాఖ కష్టాలను స్వయంగా చూసేందుకే వచ్చా.. రాహుల్ గాంధీ

విశాఖ వాసుల కష్టాలను స్వయంగా చూసేందుకే ఇక్కడకు వచ్చానని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలిపారు. హుదూద్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించేందుకు విచ్చేసిన స్టీల్ ప్లాంటుకు వెళ్లి అక్కడి కార్మికులతో మాట్లాడి, వారి సమస్యలు తెలుసుకున్నారు. 
 
ఈ సందర్భంగా మాట్లాడుతూ, స్టీల్ ప్లాంట్‌కు జరిగిన నష్టాన్ని కేంద్ర ప్రభుత్వం భర్తీ చేసేలా ఒత్తిడి తీసుకొస్తానని హామీ ఇచ్చారు. అనంతరం అక్కడి నుంచి తాటిచెట్ల గ్రామానికి రాహుల్ బయలుదేరారు. అక్కడ తుపాను బాధితులను పరామర్శిస్తారు.
 
అంతకుముందు విశాఖ చేరుకున్న కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి విశాఖ విమానాశ్రయంలో ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి, ఎంపీ కేవీపీ రామచంద్రరావులు స్వాగతం పలికారు.