శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 2 జూన్ 2019 (18:00 IST)

ఒక్కసారిగా మారిన వాతావరణం.. చల్లబడిన తెలుగు రాష్ట్రాలు

తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా వాతావరణం మారింది. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. దీంతో హైదరాబాద్ చల్లబడింది. గత నెలరోజులుగా భానుడి తీవ్రత కారణంగా నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 
 
తాజా వర్షంతో నగరం చల్లబడింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి కారణంగా హైదరాబాద్‌లో వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం తీపి కబురు చెప్పింది.  
 
మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో ఆదివారం సాయంత్రం అనూహ్యంగా వాతావరణం మారింది. ఈదురుగాలులు, పిడుగులతో ప్రజలు బెంబేలెత్తిపోయారు. విశాఖ జిల్లా బుచ్చయ్యపేట మండలంలో ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. ఈ సందర్భంగా పలు ప్రాంతాల్లో పిడుగులు పడడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. 
 
ఇంకా ప్రకాశం జిల్లా పశ్చిమప్రాంతంలోని పుల్లలచెరువు మండలంలో కూడా ఇదే పరిస్థితి కనిపించింది. మండలంలోని గాజులపాలెంలో ఈదురుగాలులకు ప్రజలు జడుసుకున్నారు.