శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 20 ఏప్రియల్ 2015 (14:06 IST)

నా గెలుపు వెనక మెగా ఫ్యామిలీ ఉంది: రాజేంద్ర ప్రసాద్

‘మా’ అధ్యక్షుడిగా ఎన్నికైన రాజేంద్రప్రసాద్, తదితర సభ్యులతో ‘మా’ పూర్వ అధ్యక్షుడు మురళీమోహన్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. ప్రతినెలా 50 మంది పేద కళాకారులకు పింఛన్లు అందిస్తామని ప్రకటించారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారం ఆదివారం ఫిలిం చాంబర్‌లో జరిగింది. 
 
ఈ  సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ - ‘‘ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకుంటాను. ‘మా’లో నూతన ఒరవడిని సృష్టిస్తా. ఇప్పటినుంచి ‘మా’ అధ్యక్షుడిగా కొత్త పాత్రలో లీనమవుతా. ఆ పాత్రకు సంపూర్ణ న్యాయం చేస్తా’’ అని చెప్పారు. తన గెలుపు వెనుక మెగా ఫ్యామిలీ ఉందని రాజేంద్రప్రసాద్  స్పష్టం చేశారు.