గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pyr
Last Updated : సోమవారం, 20 ఏప్రియల్ 2015 (20:59 IST)

రాజస్థాన్ రాయల్స్ దనాధన్..

రాజస్థాన్ రాయల్స్ గుజరాత్ లోని సర్దార్ పటేల్ స్టేడియంలో మెరుపులు మెరిపించారు. చెన్నై సూపర్ కింగ్స్ మెడలు వంచి విజయాన్ని తన ఖాతాలోకి వేసింది. 8 వికెట్లతో విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 156 పరుగులు చేసింది. 
 
ఓపెనర్ స్మిత్ (29 బంతుల్లో 40; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) ఫామ్‌ని కొనసాగించాడు. డ్వేన్ బ్రేవో (36 బంతుల్లో 62 నాటౌట్; 8 ఫోర్లు, 1 సిక్సర్) అద్భుతమైన ఇన్నింగ్స్‌తో అర్ధసెంచరీ సాధించాడు. కెప్టెన్ ధోని (37 బంతుల్లో 31 నాటౌట్; 4 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. రాజస్తాన్ రాయల్స్ జట్టు 18.2 ఓవర్లలో రెండు వికెట్లకు 157 పరుగులు చేసి నెగ్గింది. 
 
ఓపెనర్లు రహానే (55 బంతుల్లో 76 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), వాట్సన్ (47 బంతుల్లో 73; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) తొలి వికెట్‌కు ఏకంగా 144 పరుగులు జోడించి మ్యాచ్‌ను ఏకపక్షంగా మార్చేశారు. ఐపీఎల్ చరిత్రలో రాజస్తాన్‌కు ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం కావడం విశేషం.