గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 25 జులై 2016 (11:47 IST)

సారీ.. కేవీపీ బిల్లుపై ఇపుడు ఓటింగ్ చేపట్టలేం... తేల్చిచెప్పిన కురియన్!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కేవీపీ రామచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లుపై సోమవారం ఓటింగ్ చేపట్టలేమని రాజ్యసభ సభ్యుడ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కేవీపీ రామచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లుపై సోమవారం ఓటింగ్ చేపట్టలేమని రాజ్యసభ సభ్యుడు కురియన్ స్పష్టం చేశారు. అయితే, వచ్చే శుక్రవానికి ఒక రోజు ముందుగా ఓటింగ్ చేపట్టేందుకు సిద్ధమని ప్రకటించారు. 
 
సోమవారం రాజ్యసభ సమావేశాలు ప్రారంభమైన తర్వాత సభలో కేవీపీ బిల్లుపై ఓటింగ్ వాయిదా పడేలా వ్యవహరించిన బీజేపీ వైఖరిపై కాంగ్రెస్ పార్టీ సభ్యులు మండిపడ్డారు. సభలో ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ వాదనను తిప్పికొడుతూ బీజేపీ కూడా తనదైన వాదనను వినిపించింది. 
 
ఈ సందర్భంగా ఇరువర్గాలను శాంతింపజేసేందుకు యత్నించిన కురియన్ ఓ కీలక ప్రకటన చేశారు. కేవీపీ ప్రతిపాదించిన బిల్లుపై ఈ శుక్రవారం కూడా ఓటింగ్ కు అనుమతించే ప్రసక్తే లేదని ఆయన చెప్పారు. సభా నియమాల ప్రకారం ఈ శుక్రవారం తర్వాత వచ్చే శుక్రవారం (ఆగస్ట్ 5)న కేవీపీ బిల్లుపై ఓటింగ్‌కు సిద్ధమని ఆయన ప్రకటించారు.