గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 7 అక్టోబరు 2015 (15:13 IST)

కుమార్తెపై తండ్రి అత్యాచారం.. జైలుశిక్ష :: క్లినిక్‌కు వచ్చిన మహిళ వద్ద డాక్టర్ అసభ్య ప్రవర్తన

హైదరాబాద్ నగరంలో మహిళల మానప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. చాంద్రాయణగుట్టలో కన్నకుమార్తెపై అత్యాచారం చేసిన కేసులో తండ్రికి పదిన్నరేళ్ళ జైలుశిక్ష పడింది. అలాగే, ఓ క్లినిక్ నడుపుతున్న డాక్టర్‌పై కూడా హైదరాబాద్‌లో కేసు నమోదైంది. ఈ వివరాలను పరిశీలిస్తే...
 
చాంద్రాయణగుట్ట ఇన్‌స్పెక్టర్ రామారావు తెలిపిన వివరాల మేరకు ప్రాంతంలో నివసించే మహ్మద్ సలీం (43)కి భార్య, ఇద్దరు కుమార్తెలు, ముగ్గురు కొడుకులు. 2011 ఏప్రిల్ 28న సలీం తన చిన్న కుమార్తె (9)పై అత్యాచారం చేశాడు. భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఈ కేసును విచారించిన స్థానిక కోర్టు నేరం రుజువు కావడంతో తండ్రికి పదిన్నరేళ్ళ జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. 
 
అలాగే, హైదరాబాద్‌ తిరుమలగిరిలో మరో కీచక వైద్యుడి బాగోతం వెలుగు చూసింది. గణేష్‌ మహదేవన్‌ అనే డాక్టర్‌ స్థానికంగా గీత క్లీనిక్‌ను నడిపిస్తున్నారు. ఓ మహిళ వైద్యం కోసం అతని దగ్గరికి వచ్చింది. అయితే ఆమెకు మత్తు మందు ఇచ్చిన గణేష్‌ ఆ మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమెకు మెలుకువ వచ్చి చూసేసరికి వివస్త్రంగా మారివుంది. ఆ తర్వాత డాక్టర్‌ను బూతులు తిట్టి.. జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పడంతో తిరుమలగిరి స్టేషన్‌లో డాక్టర్‌‌పై ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.