Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

'నువ్వు మాకు నచ్చలేదు'.. బీజేపీకి చుక్కలు చూపిస్తున్న నెటిజన్లు

మంగళవారం, 6 ఫిబ్రవరి 2018 (08:50 IST)

Widgets Magazine
bjp flag

'నువ్వు నాకు నచ్చావ్'... ఇది విక్టరీ వెంకటేష్ నటించిన సూపర్ హిట్ చిత్రం. ఇపుడు 'నువ్వు మాకు నచ్చలేదు'. ఈ టైటిల్‌ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన నెటిజన్లు బీజేపీకి పెట్టిన పేరు. రాష్ట్ర విభజన సమయంలో తల్లిని చంపి బిడ్డకు ప్రాణం పోసిందంటూ బీజేపీ నేతలు ప్రగల్భాలు పలికారు. కానీ, చేతల్లోకి వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీ కంటే బీజేపీనే దగా చేసింది. గత నాలుగేళ్లుగా ఇదిగో సాయం.. అవిగో నిధులంటూ ఊరిస్తూ వచ్చిన బీజేపీ పాలకులు.. తమ హయాంలో ప్రవేశపెట్టిన చిట్టచివరి బడ్జెట్‌లో మొండిచేయి చూపారు. ఫలితంగా ఏపీ ప్రజలు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో కమలం పార్టీకి ఏపీ నెటిజనులు చుక్కలు చూపిస్తున్నారు. 'నువ్వు మాకు నచ్చలేదు' అంటూ పార్టీ ఫేస్‌బుక్‌ పేజీని 'డిస్‌లైక్‌' చేస్తున్నారు. సింగిల్‌ స్టార్‌ రేటింగ్‌ ఇస్తూ తమ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ దెబ్బకు మూడుకుపైగా ఉన్న బీజేపీ ఫేస్‌బుక్‌ పేజీ రేటింగ్‌... సోమవారం నాటికి 1.1కి పడిపోయింది. 2018-19 వార్షిక బడ్జెట్‌కు ముందు ఫైవ్‌స్టార్‌ ఇచ్చిన వాళ్లు ఇప్పుడు సింగిల్‌ స్టార్‌ ఇస్తున్నారు. 
 
దీంతో బీజేపీ సోషల్‌ మీడియా విభాగం అప్రమత్తమైంది. తమ ఫేస్‌బుక్‌ పేజీలో 'డిస్‌లైక్' ఆప్షన్‌ను, రేటింగ్‌ కోరడాన్ని బ్లాక్‌ చేశారు. కానీ... కామెంట్లను నిలువరించలేదు కదా! "హోదా ఇవ్వలేదు... ప్యాకేజీ అంటూ ఆ నిధులూ మంజూరు చేయలేదు. రైల్వే జోన్‌ ప్రకటించలేదు. చివరికి.. తాజా బడ్జెట్‌లో మొండిచేయి చూపారు" అంటూ జనం విరుచుకుపడుతున్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

బీహార్‌లో అబ్బాయిల్ని కిడ్నాప్ చేసి... అలా చేస్తున్నారు?

బీహార్‌లో అబ్బాయిల కిడ్నాప్ ఉదంతాలు పెచ్చరిల్లిపోతున్నాయి. 18 ఏళ్లకు పైబడిన అబ్బాయిలను ...

news

రైలు జనరల్ బోగీలో స్టౌవ్‌లో కోట్ల రూపాయల విలువ చేసే బంగారం... నెల్లూరులో....

నెల్లూరు జిల్లాలోని రైల్వేస్టేషన్‌లో రైల్వే పోలీసులు ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. గౌహతి ...

news

పనిమనిషిలా చేరుతుంది... యజమానులను పెళ్ళిచేసుకుంటుంది.. ఆ తరువాత?

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు వివాహాలు చేసుకుందో మహిళ. జల్సాలకు అలవాటుపడి, భర్త ...

news

కేంద్రం నుంచి నిధులు రాబట్టేందుకు సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్... ఏంటది?

‘‘ఈ బడ్జెట్లో కేంద్రం నుంచి రాష్ట్రానికి ప్రత్యేకంగా కేటాయింపులు జరపలేదు. అయినా మన సమర్థత ...

Widgets Magazine