గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , గురువారం, 26 జనవరి 2017 (07:08 IST)

తెలుగువాళ్లం ఇలాగే తన్నుకుంటూ ఉంటే ఏ విభూషణ్‌లూ రావు: ఏపీ, టీఎస్ సిపార్సులు బుట్టదాఖలు

కేంద్రప్రభుత్వం బుధవారం ప్రకటించిన పద్మఅవార్డులు రెండు తెలుగు రాష్ట్రాలకు షాక్ కలిగించాయి. ఎందుకంటే పద్మవిభూషణ్, పద్మ భూషణ్ అవార్డుల కోసం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు సిఫార్సు చేసి పంపిన పేర్లను కేంద్రం ప్రభుత్వం మొత్తంగా కొట్టిపడేసింది. తెలంగాణ

కేంద్రప్రభుత్వం బుధవారం ప్రకటించిన పద్మఅవార్డులు రెండు తెలుగు రాష్ట్రాలకు షాక్ కలిగించాయి. ఎందుకంటే పద్మవిభూషణ్, పద్మ భూషణ్ అవార్డుల కోసం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు సిఫార్సు చేసి పంపిన పేర్లను కేంద్రం ప్రభుత్వం మొత్తంగా కొట్టిపడేసింది. తెలంగాణ ప్రభుత్వం ఈ అవార్డులకు 25మంది పేర్లను సిపార్సు చేయగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 22 పేర్లు ప్రతిపాదించింది. వీరిలో ఒక్కరి పేరును కూడా కేంద్రం పరిగణనలోకి తీసుకోకపోవడం దారుణం. 
అయితే పద్మశ్రీ అవార్డులకు సంబంధించి తెలంగాణకు ఆరు అవార్డులు వస్తే, ఏపీకి కేవలం రెండే అవార్డులు వచ్చాయి. (చంద్రబాబు రోజూ మోదీ నిత్యనామస్మరణ ఫలితమేనా). 
 
చిత్రాల్లో విచిత్రమేమిటంటే తెలంగాణ నుంచి సివిల్ సర్వీసుల విభాగంలో పద్మభూషణ్ అవార్డు పొందిన త్రిపురనేని హనుమాన్ చౌదరి వాస్తవానికి ఆంధ్రప్రదేశ్‌కి చెందినవారు. కాగా ఆంధ్రప్రదేశ్ నుంచి సైన్స్ ఇంజనీరింగ్ కోటా కింద అవార్డు పొందిన చింతకింది మల్లేశం తెలంగామలోని బోనగిరి జిల్లా యాదాద్రిలోని ఆలేరుకు చెందిన వారు.  
తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లి సవరణకోసం ప్రయత్నించింది.
 
కాగా రెండు తెలుగు రాష్ట్రాలూ ఒలింపిక్ బ్యాడ్మింటన్ రజక పతక గ్రహీత పి.వి సింధు పేరును పద్మ విభూషణ్ అవార్డుకు సిఫార్సు చేస్తే దాన్ని కేంద్రం ఆమోదించలేదు. ఆమెకు గత సంవత్సరం పద్మశ్రీ అవార్డు ఇచ్చారు కాబట్టి రెండు పద్మ అవార్డుల మధ్య కనీసం అయిదేళ్ల గ్యాప్ ఉండాలని నిబంధనలు. 
 
అన్నిటికంటే ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్ర ప్రభుత్వాలు వరుసగా  25, 22 మంది పేర్లను పద్మ విభూషణ్ అవార్డులకోస  సిఫార్సు చేస్తే ఒక్క పేరును కూడా కేంద్రం పరిగణించలేదు. 
రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఇంకా నీళ్లకోసం, ఆపీసుల కోసం, ఆస్తుల కోసం పనికిరాని యవ్వారాల కోసం కొట్టుకుని చస్తుంటే కేంద్రం ఆ ఇచ్చే కొన్నయినా ఇవ్వదు గాక ఇవ్వదు అని సగటు మనిషి అంతరంగమథనం.