శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PY REDDY
Last Updated : ఆదివారం, 21 డిశెంబరు 2014 (10:06 IST)

ఫినాయిల్ తాగి ఒకరు.. టూబ్ లైటు తిని మరోకరు.. స్మగ్లర్ల ఆత్మహత్యాయత్నం

చేసింది స్మగ్లింగు.. పోలీసులకు ప్రత్యక్షంగా పట్టుబడ్డారు. ఎన్ కౌంటర్ అవుతామేమోనని  ఫినాయిల్ తాగి ఒకరు, గాజుపెంకులు తిని మరొకరు ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టారు. ఆసుపత్రి పాలయ్యారు. కడపజిల్లాలో చోటుకు చేసుకున్న సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. కడప జిల్లాలోని ముదిరెడ్డిపల్లి అటవీ ప్రాంతంలో ఆరుగురు స్మగ్లర్లను అటవీశాఖ అధికారులు ఆదివారం తెల్లవారుజామున అదుపులోకి తీసుకున్నారు. 
 
అనంతరం వారిని మైదుకూరు మండలం వనిపెంటలోని కార్యాలయానికి తరలించారు. దాంతో కార్యాలయంలోని పినాయిల్ తాగి ఒకరు, ట్యూబ్ లైట్ ముక్కలు మింగి మరోకరు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఆ విషయాన్ని గమనించిన అటవీ శాఖ అధికారులు వారు హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. స్మగ్లర్లు తమిళనాడు ప్రాంతానికి చెందిన వారని అటవీశాఖ అధికారులు వెల్లడించారు. 
 
అలాగే ప్రకాశం జిల్లాలో ఎర్రచందనం నిల్వ ఉంచిన డంప్ను అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం విలువ రూ. 5 లక్షలు ఉంటుందని అటవీ శాఖ అధికారులు వెల్లడించారు.  ఈ మధ్యకాలంలో పోలీసులు ఎన్ కౌంటర్లు మొదలు పెట్టడంతో ఆత్మహత్యాయత్నాలతో స్మగ్లర్లు కౌంటర్లు మొదలు పెట్టారు