సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 6 మార్చి 2020 (07:34 IST)

రేవంత్‌ రెడ్డి అరెస్ట్‌.. 14 రోజుల రిమాండ్

టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. రాజేంద్రనగర్‌లోని జడ్జి నివాసంలో రేవంత్‌ను పోలీసులు హాజరుపర్చారు. రేవంత్‌కు 14 రోజుల రిమాండ్‌ విధించారు.

రేవంత్‌రెడ్డిని పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు. కేటీఆర్ ఫామ్‌హౌస్‌ను డ్రోన్‌తో చిత్రీకరించారని రేవంత్‌పై అభియోగం ఉందని పోలీసులు చెబుతున్నారు. అంతకు ముందు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో రేవంత్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.

ఢిల్లీ నుంచి వస్తుండగా రేవంత్‌రెడ్డిని ఎస్‌వోటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేటీఆర్ ఫామ్‌హౌస్‌ను డ్రోన్‌తో చిత్రీకరించారని రేవంత్‌పై అభియోగం, ఇప్పటికే నలుగురు రేవంత్‌రెడ్డి అనుచరులను అరెస్ట్‌ చేశారు.

రేవంత్ సహా 8 మందిపై నార్సింగ్‌ పీఎస్‌లో కేసు నమోదు చేశారు. ఐపీసీ 184, 187, 11 రెడ్ విత్ 5ఏ, ఎయిర్‌క్రాఫ్ట్‌ యాక్ట్‌ కింద కేసు నమోదయ్యాయి.
 
ఇదిలా వుండగా రేవంత్‌ని శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో అరెస్ట్‌ చేయలేదని, రేవంత్‌రెడ్డి తనంతట తానే నార్సింగ్‌ పీఎస్‌కు వచ్చారని సైబరాబాద్‌ పోలీసులు తెలిపారు. డ్రోన్‌ కేసులో తనను ఎలా చేరుస్తారంటూ రేవంత్‌ వాగ్వాదానికి దిగారని పోలీసులు చెప్పారు.

పోలీసుల వాదనను వినిపించుకోలేదని సైబరాబాద్‌ పోలీసులు పేర్కొన్నారు. రేవంత్‌ పాత్రకు సంబంధించిన ఆధారాలను చూపించామని, పోలీస్‌ విచారణకు ఆయన సహకరించలేదని సైబరాబాద్‌ పోలీసులు స్పష్టం చేశారు.

అందువల్లే రేవంత్‌ను అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపరిచామని సైబరాబాద్‌ పోలీసులు వెల్లడించారు. ఇప్పటికే నలుగురు రేవంత్‌రెడ్డి అనుచరులను అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు. రేవంత్ సహా 8 మందిపై నార్సింగ్‌ పీఎస్‌లో కేసు నమోదు చేశారు.

ఐపీసీ 184, 187, 11 రెడ్ విత్ 5ఏ, ఎయిర్‌క్రాఫ్ట్‌ యాక్ట్‌ కింద కేసు నమోదయ్యాయి. ఇదిలా వుండగా రేవంత్ రెడ్డి అరెస్టును ఖండిస్తూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంతో పాటు పలుచోట్ల కాంగ్రెస్ కార్యకర్తలు, ఆయన అభిమానులు కేసీఆర్ దిష్టి బొమ్మ దహనం చేశారు. రాస్తారోకో చేపట్టారు.