బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 21 నవంబరు 2014 (16:29 IST)

కేసీఆర్‌కు ఆపరేషన్ బ్లూ స్టార్ అంటే ఏమిటో తెలుసా?

తెలంగాణ సీఎం కేసీఆర్‌ తెలంగాణ శాసనసభలో ఏం మాట్లాడుతానోనని వణికిపోతున్నారని టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి అన్నారు. శాసనసభలో తానేం మాట్లాడుతానో.. ప్రజలకు ఏ కొత్త విషయం చెబుతానోనని కేసీఆర్ భయపడుతున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. 
 
హైదరాబాదులో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, తనకు భయపడే సీఎం తనపై దుష్ప్రచారం చేయిస్తున్నారని దుయ్యబట్టారు. ఉద్యమ నాయకుడినని చెప్పుకునే ఆయనకు ఇలాంటి పనులు తగునా? అని రేవంత్ ప్రశ్నించారు. 
 
టీఆర్ఎస్ తమవిగా చెప్పుకునే టీవీ, పేపర్లకు పెట్టుబడులు ఎక్కడి నుంచి వచ్చాయో ప్రకటించాలని డిమాండ్ చేశారు. విద్యుత్ ప్రాజెక్టులు, సిమెంట్ కంపెనీల్లో ఏముందో చెప్పగలనని హెచ్చరించారు. 
 
టీఆర్ఎస్ నేతలకు చెందిన పలు కంపెనీల్లో ఆంధ్రావారి పెట్టుబడులు లేవా? అని రేవంత్ రెడ్డి నిలదీశారు. డీఎల్ఎఫ్‌కు సంబంధించి మీరే ఏకపాత్రాభినయం చేస్తే ఎలా? ప్రతిపక్షాలు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వరా? అని మండిపడ్డారు. 
 
కేసీఆర్‌కు ఆపరేషన్ బ్లూ స్టార్ అంటే ఏమిటో తెలుసా? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి అధికారాలను కేసీఆర్ దుర్వినియోగం చేస్తున్నారని రేవంత్ దుయ్యబట్టారు.