Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం ముగ్గురి మృతి

గురువారం, 2 ఫిబ్రవరి 2017 (14:58 IST)

Widgets Magazine
road accident

చిత్తూరు జిల్లా రహదారులు రక్తమోడాయి. గురువారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు విగత జీవులుగా మారారు. అది కూడా శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వస్తుండగా ప్రమాదం జరిగింది. హైదరాబాద్‌కు చెందిన ఐదుమంది స్నేహితులు తిరుమల శ్రీవారి దర్శనార్థం బుధవారం రాత్రి కారులో బయలుదేరారు. వీరు ప్రయాణిస్తున్న కారును రేణిగుంట సమీపంలోని వెదళ్ళచెరువు వద్ద లారీ ఢీకొంది. 
 
ఈ ప్రమాదంలో ప్రేమ్ సుందర్, కిషన్‌ రెడ్డి, హనుమంత రెడ్డిలు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను తిరుపతి రుయాసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషయమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. లారీ డ్రైవర్ లారీని అతి వేగంగా నడపడంతోనే ప్రమాదం జరిగిందని ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

తిరుపతికి మొండిచేయి చూపించిన విత్తమంత్రి అరుణ్ జైట్లీ

ప్రముఖ ఆధ్మాత్మిక క్షేత్రం తిరుమల. ప్రతిరోజు 50 నుంచి 70వేల మందికిపైగా భక్తులు తిరుపతికి ...

news

శశికళ వర్సెస్ పన్నీర్ సెల్వం.. అమ్మ స్మారకమండపం శంకుస్థాపన జరిగేనా?

అన్నాడీఎంకేలో ఆధిపత్య పోరు వెలుగులోకి వస్తోంది. ప్రస్తుతం దివంగత ముఖ్యమంత్రి జయలలిత ...

news

డోనాల్డ్ ట్రంప్ ఇమ్మిగ్రేషన్ ఆర్డర్స్ దెబ్బకు అమెరికా ఆర్థికవ్యవస్థ మటాష్

అమెరికా కొత్త అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ జారీ చేసిన ఇమ్మిగ్రేషన్ ఆర్డర్స్ దెబ్బకు ఆ దేశ ...

news

అనంతలో పయ్యావుల కేశవ్ అనుచరులు ఎంత పని చేశారో తెలుసా?

అనంతపురం జిల్లాలో అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన నేతల ఆగడాలు, అరాచకాలు అంతకంతకూ ...

Widgets Magazine