గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 2 సెప్టెంబరు 2015 (12:06 IST)

ఆడపిల్లల ప్రాణాలంటే టీడీపీ సర్కారుకు విలువ లేదా?: రోజా ప్రశ్న

ఆడపిల్లల ప్రాణాలంటే తెలుగుదేశం ప్రభుత్వానికి విలువ లేదా అని ప్రతిపక్ష సభ్యురాలు రోజా ప్రశ్నించారు. రిషితేశ్వరి ఆత్మహత్యకు కారణమైన వారందరిపై చర్యలు తీసుకోవాలని రోజా డిమాండ్ చేశారు. ఏపీ అసెంబ్లీ మూడు రోజు ప్రారంభమైన తరుణంలో.. రోజా మాట్లాడుతూ.. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ర్యాగింగ్ కారణంగా ఆత్మహత్య చేసుకున్న రిషితేశ్వరి మృతికి టీడీపీయే కారణమని ఆరోపించారు. టీడీపీ అధికారంలోకి వచ్చాకే మహిళలపై దాడులు పెరిగాయని రోజా అన్నారు. ఆత్మహత్యకు కారణమైన ప్రిన్సిపాల్‌కు టీడీపీ కొమ్ముకాస్తుందని ఆరోపించారు.
 
ఇదిలా ఉంటే.. నాగార్జున యూనివర్శిటీలో ఆత్మహత్య చేసుకున్న రిషితేశ్వరి ఘటనపై అసెంబ్లీలో మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటన చేశారు. రిషితేశ్వరి ఆత్మహత్య కేసులో వేసిన నిజనిర్ధారణ కమిటీ 172 మందిని ప్రశ్నించిందని చెప్పారు. ప్రభుత్వం తీసుకున్న సత్వర చర్యలతో రిషితేశ్వరి తండ్రి తమకు కృతజ్ఞతలు చెబుతూ మెసేజ్ కూడా పంపారన్నారు. ఇటువంటి ఘటనలపై కచ్చితమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ర్యాగింగ్‌కు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, వారు ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని, వదిలిపెట్టమని గంటా స్పష్టం చేశారు.