గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : ఆదివారం, 12 ఫిబ్రవరి 2017 (15:30 IST)

రోజాను ఆహ్వానించి అడ్డుకుంటారా? పోరాడుతామన్న జగన్.. కంటతడి పెట్టిన రోజా

వైకాపా ఎమ్మెల్యే మీడియా ముందు కంటతడి పెట్టారు. అమరావతిలో జరుగుతున్న మహిళా పార్లమెంట్ సదస్సుకు హాజరయ్యేందుకు వచ్చిన రోజాను పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. ఆపై నాటకీయ పరిణామాల మధ్య రోజాను హైదరాబాద్‌కు

వైకాపా ఎమ్మెల్యే మీడియా ముందు కంటతడి పెట్టారు. అమరావతిలో జరుగుతున్న మహిళా పార్లమెంట్ సదస్సుకు హాజరయ్యేందుకు వచ్చిన రోజాను పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. ఆపై నాటకీయ పరిణామాల మధ్య రోజాను హైదరాబాద్‌కు తరలించారు. అనంతరం రోజా మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ సీఎం చంద్రబాబు కక్ష్య పూరితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. 
 
ప్రభుత్వం వల్ల తనకు ప్రాణహాణి ఉందని, తమ ప్రాణాలు పోతే బాధ్యులు ఎవరు? అని ప్రభుత్వాన్ని రోజా ప్రశ్నించారు. గతంలో టీడీపీ కోసం ఏంతో కష్టపడితే ఇదా తనకిచ్చే బహుమతి అంటూ అడిగారు. రాష్ట్రంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ప్రశ్నించడం తప్పా అని నిలదీశారు. ఉగ్రవాదినో, హంతకురాలినో అన్నట్లు పోలీసులు తనపై అత్యుత్సాహం ప్రదర్శించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఒక శాసన సభ్యురాలికే రక్షణ లేకుండాపోయిందని అన్నారు. నారా బ్రాహ్మణి, వెంకయ్య నాయుడు కూతురు కోసమే జాతీయ మహిళా పార్లమెంట్ పెట్టారా..? అని రోజా ప్రభుత్వాన్ని నిలదీశారు.
 
ఇదిలా ఉంటే.. తమ పార్టీ ఎమ్మెల్యే రోజాను జాతీయ మహిళా పార్లమెంటేరియన్ల సదస్సుకు ఆహ్వానించి అడ్డుకోవడంపై వైకాపా అధినేత జగన్ మండిపడ్డారు. ఒక మహిళా ఎమ్మెల్యే పట్ల ప్రభుత్వమే ఇలా వ్యవహరిస్తే.. ఇక సమాజంలోని సాధారణ మహిళలకు ఎలా రక్షణ లభిస్తుందని ఆయన ట్వీట్ చేశారు. ఆహ్వానం పంపికూడా అడ్డుకోవడమన్నది ఈ సదస్సును అపహాస్యం చేయడమేనని జగన్ వ్యాఖ్యానించారు. రోజాకు జరిగిన అన్యాయంపై పోరాడుతామని, అన్ని వేదికల్లోనూ ఈ ఘటనను లేవనెత్తుతామని జగన్ పేర్కొన్నారు.