గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By JSK
Last Modified: గురువారం, 19 మే 2016 (16:41 IST)

'రోను' తుఫానుతో భారీ వర్షాలు... సీఎం చంద్ర‌బాబు సంతృప్తి... ఎందుకు..?

విజయవాడ: ‘రోను’ తుఫాను ప్రభావంతో ఏపీలో వివిధ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయ‌ని, ఈదురుగాలుల ఉధృతికి జనజీవనం అస్తవ్యస్థం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని తన నివా

విజయవాడ: ‘రోను’ తుఫాను ప్రభావంతో ఏపీలో వివిధ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయ‌ని, ఈదురుగాలుల ఉధృతికి జనజీవనం అస్తవ్యస్థం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని తన నివాస గృహం నుంచి బుధవారం ముఖ్యమంత్రి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ ఎస్.పి టక్కర్, తీరప్రాంత జిల్లాల కలెక్టర్లతో, ఇతర ఉన్నతాధికార్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పడిపోయిన చెట్లను తొలగించి ట్రాఫిక్‌కు అవరోధం లేకుండా చేయాలని, కూలిన విద్యుత్ స్తంభాలను వెంటనే నిలబెట్టి విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలని కోరారు.అవసరమైన ప్రాంతాలలో పునరావాస శిబిరాలను ఏర్పాటుచేసి భోజనం, తాగునీరు అందించాలని ఆదేశించారు.
 
అధికార యంత్రాంగాన్ని కలెక్టర్లు అప్రమత్తం చేయాలని, క్షేత్ర స్థాయిలో ఏం జరుగుతోందో, తుపాను తీవ్రత, ధోరణులు ఎలా  మారుతున్నాయో ఎప్పటికప్పుడు అధికారులు పరిశీలించి సహాయ, పునరావాస చర్యలను ముమ్మరం చేయాలని ముఖ్యమంత్రి కోరారు. నవ్యాంధ్రప్రదేశ్‌కు వారసత్వంగా సంక్షోభాలు సంక్రమించాయని, సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకునే పరిస్థితుల్లో మనం ఉన్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో అన్నారు. జిల్లా కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్‌‌లో మాట్లాడుతూ ‘హుద్ హుద్ తుపాను సంక్షోభాన్ని అదేవిధంగా అధిగమించాం. 
 
ఏడాది కాలంలోనే విశాఖపట్టణాన్ని ప్రపంచపటంలో పెట్టాం. నీరు-ప్రగతి చేపట్టి కరవు రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను చేస్తున్నాం’ అని సీఎం వివరించారు. రాష్ట్రాన్ని ఐదేళ్లలోపు కరవురహితంగా చేయాలనేది లక్ష్యంకాగా అంతకన్నా ముందే రాష్ట్రాన్ని సుసంపన్నం చేసేందుకు అధికార యంత్రాంగం శ్రద్ధ పెట్టాలని కోరారు. భారీవర్షాల వల్ల మట్టి మెత్తపడింది కాబట్టి పంటకుంటలు, ఇంకుడు గుంతల తవ్వకం ముమ్మరం చేయాలని, గత ఏడాది మే నెల కన్నా భూగర్భజలాలు రాష్ట్రవ్యాప్తంగా 1.22 మీటర్లు పెరిగాయని సీఎం తెలిపారు. ఇందువల్ల 110 టీఎంసీల భూగర్భజలాలు అందుబాటులోకి రానున్నాయన్నారు.
 
చిత్తూరు జిల్లాలో గత ఏడాది ఇదే సమయానికి భూగర్భజలాలు 30 మీటర్ల లోతులో ఉంటే ఈ ఏడాది 13 మీటర్ల లోతుకు వచ్చాయని, జల మట్టం 17 మీటర్లు పెరిగిందని, కడపలో 8.7 మీటర్లు పెరిగిందని, నెల్లూరు, అనంతపురం, తూర్పు గోదావరి జిల్లాలలో గత ఏడాదికన్నా భూగర్భ జల మట్టాలు పెరిగాయని సంతృప్తి వ్యక్తం చేశారు.