యువతిపై రౌడీ షీటర్ రేప్.. తల్లి కళ్లముందే మూడు రోజులు.. కుక్కను కూడా?

హైదరాబాదులో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ యువతిపై రౌడీ షీటర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. తల్లి కంటిముందే మూడు రోజుల పాటు యువతిపై ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ ఘటన నగరంలోని వారాసిగూడ పరిధిలోని అంబర్‌నగర్‌

selvi| Last Updated: శుక్రవారం, 6 జులై 2018 (18:14 IST)
హైదరాబాదులో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ యువతిపై రౌడీ షీటర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. తల్లి కంటిముందే మూడు రోజుల పాటు యువతిపై ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ ఘటన నగరంలోని పరిధిలోని అంబర్‌నగర్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అమీర్ అనే రౌడీ షీటర్ ఓ యువతిపై అత్యాచారానికి పాల్పడటంతో పాటు దారుణంగా హింసించాడు. 
 
అడ్డుకోబోయిన యువతి తల్లిపై రౌడీ షీటర్ దాడి చేయడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. బాధిత యువతి కుటుంబానికి చెందిన పెంపుడు శునకాన్ని కూడా అతడు వదిలిపెట్టలేదు. దాన్ని తీవ్రంగా కొట్టి హింసించాడు. ఈ ఘటనపై బాధితురాలు స్థానికుల సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 
 
ఇకపోతే, నిందితుడు పరారీలో వున్నాడు. అతడిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే పరారీలో వున్న నిందితుడు.. తనపై పెట్టిన కేసును వాపస్ తీసుకోవాలని లేకుంటే చంపేస్తానంటూ ఫోనులో బెదిరిస్తున్నాడని బాధితురాలు వాపోయింది.దీనిపై మరింత చదవండి :