శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pyr
Last Modified: మంగళవారం, 31 మార్చి 2015 (12:07 IST)

ఏపికి రూ. 1500 కోట్ల కేంద్ర నిధులు.. రాజధాని నిర్మాణానికే..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నూతన రాజధాని నిర్మాణానికి కేంద్రం నిధులు ప్రకటించింది. రూ.1500 కోట్ల నిధులను ఇవ్వనున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. రాష్ట్ర విభజన జరిగిన తరువాత ఇంత పెద్ద ఎత్తున రాజధాని కోసం నిధులను కేటాయించడం ఇదే మొదటి సారి.

ఇటీవలన చంద్రబాబు ప్రధాన మంత్రి మోడీని కలసి రాష్ట్ర పరిస్థితులను వివరించిన విషయం తెలిసిందే. తరువాత గవర్నర్ ఢిల్లీలోనే ఇంకా ఉన్నతస్థాయి నాయకులు శాఖలతో మంతనాలు చేస్తూనే ఉన్నారు. ఇలాంటి తరుణంలో ఆర్థిక శాఖ నిధులను ప్రకటించడం విశేషం.
 
తాను సాయం చేస్తున్న నిధులలో వెయ్యికోట్లను రాజధాని అవసరాల కోసం అన్నట్లు ప్రకటించింది. ఇదిలా ఉండగా మరో రూ. 500 కోట్లు ప్రత్యేకించి రాజ్ భవన్, ఆంధ్రప్రదేశ్ సచివాలయం, శాసనసభ, హైకోర్టు నిర్మాణానికి కేటాయించింది. ఈ నిధులు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం2014ను అనుసరించి విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.