గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By CVR
Last Updated : బుధవారం, 15 అక్టోబరు 2014 (14:23 IST)

తుఫాను కారణంగా విద్యుత్ శాఖకు వెయ్యి కోట్ల నష్టం

తుఫాను కారణంగా విద్యుత్ శాఖకు వెయ్యి కోట్ల నష్టం

హుదూద్ తుపాను విలయతాండంతో రాష్ట్ర విద్యుత్ వ్యవస్థకు రూ. వెయ్యి కోట్ల నష్టం వాటిల్లిందని రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి అజయ్ జైన్ వెల్లడించారు. ఆ నష్టంలో 80 శాతం విశాఖ నగరంలోనే జరిగిందని తెలిపారు.
 
విశాఖపట్నంలో బుధవారం అజయ్ జైన్ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... ఈ రోజు రాత్రికి 50 నుంచి 70 వేల మందికి విద్యుత్ ఇవ్వగలమన్నారు. పూర్తి స్థాయిలో కరెంట్ సరఫరాకు మరో నాలుగు రోజుల సమయం పడుతుందన్నారు. విశాఖ ఒక్క నగరంలోనే విద్యుత్ వ్యవస్థను పునరుద్ధరించేందుకు 2 వేల మంది సిబ్బంది పని చేస్తున్నారన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి ట్రాన్స్ఫార్మర్లను తెప్పిస్తున్నామని చెప్పారు. గురువారం ఉదయం స్టీల్ ప్లాంట్, ఎయిర్ పోర్ట్లకు కరెంట్ ఇస్తామని తెలిపారు.
 
గాజువాక సబ్ స్టేషన్ పరిధిలో విద్యుత్ను ఇప్పటికే పునరుద్ధరించామన్నారు. విశాఖ జిల్లాలో పలు 130 కేవీ సబ్ స్టేషన్లను పునరుద్ధరించినట్లు చెప్పారు. ఈ రోజు సాయంత్రంలోగా నక్కవారిపాలెం సబ్ స్టేషన్ పరిధిలో విద్యుత్ను పునరుద్ధరిస్తామని తెలిపారు. ముందస్తు చర్యల వల్ల ప్రాణనష్టం బాగా తగ్గించ గలిగామని అజయ్ జైన్ వెల్లడించారు.