బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 10 ఫిబ్రవరి 2016 (10:55 IST)

లిఫ్ట్ ఇచ్చిన పాపానికి రూ.20లక్షలు గోవిందా..? బందరు కాల్వలో వేసేశారట!

లిఫ్ట్ ఇచ్చిన పాపానికి రూ.20 లక్షలు దోపిడికి గురైంది. తనతో పాటు హైదరాబాదుకు వస్తానని చెప్పిన ఇద్దరు బంధువుల అమ్మాయిలకు సాయం చేద్దామనే ఉద్దేశంతో కారు ఎక్కించుకుంటే.. సినీ ఫక్కిలో రూ.20 లక్షలు కొట్టేశారు. ఈ ఘటన విజయవాడలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. ఓ ప్రైవేట్ సంస్థలో తమ్మారెడ్డి శ్రీనివాస్ పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో సంస్థకు చెందిన రూ. 20 లక్షలను హైదరాబాద్‌లో అందించేందుకు బయలుదేరాడు. తనతో పాటు హైదరాబాద్‌కు వస్తామని, తోడుగా ఉండాలని చెప్పిన బంధువుల యువతులను కారెక్కించుకుని రైల్వే స్టేషనుకు బయలుదేరాడు. 
 
మార్గమధ్యంలో అల్పాహారం నిమిత్తం కారు ఆపి టిఫిన్ చేశాడు. ఆపై రైల్వే స్టేషనుకు వెళ్లి చూడగా డబ్బు కనిపించలేదు. దీంతో అవాక్కయిన శ్రీనివాస్ సూర్యారావు పేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కారులోని అమ్మాయిలను విచారించిన పోలీసులు నిజాన్ని తెలుసుకున్నారు.

ఆ డబ్బును ఆ యువతులే కాజేశారని.. భయంతో బందరు కాల్వలో పడేశామన్నారు. దీంతో బందరు కాల్వలో వెతికి డబ్బు సంచీని గుర్తించిన పోలీసులు దాన్ని బాధితుడికి అందించారు. యువతులకు వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇస్తామన్నారు.