Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

బెడ్రూముల్లో సీసీ కెమేరాలు.. భార్య, అత్త, మరదలి ఏకాంత దృశ్యాల చిత్రీకరణ... డబ్బు కావాలని శాడిస్ట్ భర్త టార్చర్

గురువారం, 18 మే 2017 (08:41 IST)

Widgets Magazine
sadist

ఓ శాడిస్టు భర్త... తన భార్యను ఎన్ని విధాలుగా టార్చర్ పెట్టాలో అన్ని విధాలుగా పెట్టాడు. భర్త పెట్టే చిత్రహింసలన్నింటినీ భార్య ఓర్చుకుంది. ఇకలాభం లేదని గ్రహించిన ఆ శాడిస్టు.. తమ పడక గదిలోనేకాకుండా, అత్త, మరదలు(భార్య సోదరి) బెడ్రూమ్‌లలో రహస్య కెమేరాలు అమర్చి.. వారి ఏకాంతపు దృశ్యాలను చిత్రీకరించాడు. ఆ తర్వాత డబ్బు ఇవ్వాలని లేదంటే అశ్లీల వెబ్‌సైట్లను ఈ దృశ్యాలను విక్రయిస్తానని భార్యను బెదిరించసాగాడు. హైదరాబాద్‌లో తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
హైదరాబాద్‌ నగరానికి చెందిన ప్రవీణ్ అనే యువకుడు విదేశాల్లో ఉద్యోగం చేస్తూ వచ్చాడు. సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధికి చెందిన ఓ యువతిని గత 2016లో పెళ్లి చేసుకున్నాడు. ఈ వివాహం చాలా గ్రాండ్‌గానే చేశారు. అనంతరం విదేశాల నుంచి వచ్చేసి అత్తారింట్లో తిష్ట వేసిన ప్రవీణ్‌... తన అత్తగారి ఇంట్లో తమకు కేటాయించిన గదితో పాటు, భార్య సోదరి, అత్త గదులలో సీసీ కెమేరాలను ఎవరికీ తెలియకుండా బిగించాడు. 
 
వీటి ద్వారా తన భార్యతో గడిపిన ఏకాంతపు దృశ్యాలతో పాటు ఆమె సోదరి, అత్తలకు సంబంధించిన వీడియోలను కూడా రికార్డు చేశాడు. అతని దుర్బుద్ధిని గుర్తించిన అత్తారింటి వాళ్లు అతనిని దూరం పెట్టగా, పుట్టింటికి వెళ్లి డబ్బు తీసుకురావాలంటూ భార్యపై వేధింపులకు దిగాడు. దీనికి ఆమె నిరాకరించడంతో సీసీ కెమేరాలతో తాను రికార్డు చేసిన వీడియోలను భార్యకు చూపించి, డబ్బు తీసుకురావాలని, లేని పక్షంలో... ఆ వీడియోలను అశ్లీల వెబ్‌ సైట్‌ లకు విక్రయించడంతో పాటు, సోషల్ మీడియాలో పెడతానని బెదిరింపులకు దిగాడు. ఇక భర్త వేధింపులు భరించలేని భార్య, తన తల్లిదండ్రులతో కలిసి సైబరాబాద్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసి ప్రవీణ్ వద్ద విచారణ జరుపుతున్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Tortures Wife Hyderabad Sadist Husband Cctv Camera Private Video

Loading comments ...

తెలుగు వార్తలు

news

బుల్లెట్ ట్రైన్‌‌తో పాటు పరుగెత్తిన ప్రయాణికుడు.. ఎందుకో తెలుసా? ఈ వీడియో చూడండి (Video)

ఓ ప్రయాణికుడు బతుకుజీవుడా అంటూ బుల్లెట్ ట్రైన్‌తో పాటు పరుగెత్తాడు. అదీ తన ప్రాణాలు ...

news

రజనీకాంత్ కొత్త రాజకీయ పార్టీ తథ్యం?... శుక్రవారమే ముహుర్తం... డైలామాలో బీజేపీ

సూపర్ స్టార్ రజనీకాంత్ కొత్త రాజకీయ పార్టీ పెట్టడం ఖాయమన రాజకీయ విశ్లేషకులు ...

news

రాజస్థాన్‌లో సెక్స్ రాకెట్ గుట్టురట్టు... అడ్వకేట్లు.. అధికారులు అరెస్టు?

రాజస్థాన్‌ రాష్ట్రంలో వెలుగు చూసిన భారీ సెక్స్ రాకెట్‌లో పెద్ద తలలు ఉన్నట్టు వార్తలు ...

news

నీవు లేకపోతే బతకలేనన్నాడు... నమ్మి వెంట నడిస్తే ఫ్రెండ్‌తో కలిసి రేప్ చేశాడు... ఎక్కడ?

తెలంగాణా రాష్ట్రంలో ఇద్దరు మైనర్ బాలికలు కామాంధులు చేతిలో మోసపోయారు. ప్రేమిస్తున్నానని ...

Widgets Magazine