ఇసుక కొరతతో రోడ్డుపడిన భవన నిర్మాణ కార్మికులు

ఎం| Last Updated: గురువారం, 18 జులై 2019 (13:01 IST)
కొరతను పరిష్కారం చేసి, భవన నిర్మాణ కార్మికులకు పని కల్పించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి యం.మహేష్ డిమాండ్ చేశారు. ఆయన కొండపల్లి స్టేషన్ సెంటర్లో భవన నిర్మాణ తాఫీ వర్కర్స్ యూనియన్ సీఐటీయూ ఆధ్వర్యంలో జిల్లాలో ఉన్నా ఇసుక క్వారీలను వెంటనే ఓఫెన్ చేసి ఇసుక కోరత లేకుండా చూడాలని, భవన నిర్మాణ కార్మికులకు పని కల్పించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి యం.మహేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఇబ్రహింపట్నంలో మండలం ఉన్నా పెర్రీ, గుంటుపల్లి, సూరయపాలెం ఇసుక రీచ్‌లను అందుబాటులో తీసుకురావలని, ఇసుక ఆక్రమ వ్యాపారంని అరికట్టాలని, ఇసుక సామన్యులకు అందుబాటులోకి తీసుకురావలని కోరారు. ఇప్పటికే పనులు లేక భవన నిర్మాణ కార్మికుల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.

ముఖ్యమంత్రి నూతన ఇసుక పాలసీని సెఫ్టెంబర్ 15 నుంచి అమలులోకి వస్తుందని చేప్పుతున్నారని, అప్పటివరకు భవన నిర్మాణ కార్మికులు పని లేకపోతే జీవన ఏవిధంగా సాగుతోందో చెప్పాలని ప్రభుత్వాన్ని మహేష్ ప్రశ్నించారు. తక్షణమే ప్రభుత్వం ఇసుకను అందుబాటులోకి తీసుకొచ్చి, భవన నిర్మాణ కార్మికులకు ప్రభుత్వం పని కల్పించాలని, వారి కష్టాలను తీర్చాలని కోరారు.దీనిపై మరింత చదవండి :