Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

చంద్రబాబుకు పాలించే హక్కు లేదు... ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయండి : రాష్ట్రపతికి కట్జూ లేఖ

బుధవారం, 17 మే 2017 (14:21 IST)

Widgets Magazine
markandeyakatju

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలోని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని తక్షణం రద్దు చేయాలని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టీస్ మార్కండేయ కట్జూ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన రాష్ట్రపతితో పాటు.. ప్రధానమంత్రికి లేఖ రాశారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న నెటిజన్ల హక్కులను కాలరాస్తూ వారి పట్ల ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సర్కారు అనాగరికంగా వ్యవహరిస్తోందని అందువల్ల టీడీపీ ప్రభుత్వాన్ని వెంటనే డిస్మిస్ చేసి, రాష్ట్రపతి పాలన విధించాలని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మార్కండేయ కట్జూ డిమాండ్ చేశారు. 
 
టీడీపీ ప్రభుత్వ పనితీరుతోపాటు ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్, సీఎం చంద్రబాబులను లక్ష్యంగా చేసుకుని కొంతమంది నెటిజన్లు వివిధ రకాల పోస్టులు చేశారు. వీటినీ సీరియస్‌గా తీసుకున్న చంద్రబాబు సర్కారు వారిపై కేసులు పెట్టి అరెస్టు చేయించింది. ముఖ్యంగా, వైకాపా పొలిటికల్ పంచ్ అడ్మినిస్ట్రేటర్ రవికిరణ్‌ను అరెస్టు చేసింది. 
 
వీటిపై మార్కండేయ కట్జూ స్పందించారు. నెటిజన్లపై ఉక్కుపాదం మోపుతూ అరెస్టు చేయడం రాజ్యాంగ విరుద్ధమని చెబుతూ, తన అభిప్రాయాన్ని ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. రాష్ట్రపతికి, ప్రధానికీ ఓ లేఖను రాస్తూ, కార్టూన్లు భావ ప్రకటనా హక్కులో భాగమని గుర్తు చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు పౌరులకు ఉంటుందని, అది ఆర్టికల్‌ 19 (1) ఏ కింద ఇవ్వబడిన హక్కని అన్నారు. 
 
ప్రజలే ప్రభువులైన ఇండియాలో పాలకులను విమర్శించే హక్కు ప్రజలకుందని, కానీ, సోషల్ మీడియా కార్యకర్తల విషయంలో ఆంధ్రప్రదేశ్‌  ప్రభుత్వ తీరు అనాగరికంగా, అప్రజాస్వామికంగా ఉందని ఆరోపించారు. చంద్రబాబు ప్రభుత్వంపై ఆర్టికల్‌ 356ను ప్రయోగించి, తక్షణం ప్రభుత్వాన్ని తొలగించాలని డిమాండ్ చేశారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

యువతిని వేధించి.. పెళ్లి చెడగొట్టిన యువకుడు.. యాసిడ్ పోస్తానని బెదిరించడంతో?

బీఎస్సీ నర్సింగ్ చదువుకునే విద్యార్థినిని ఓ యువకుడు వేధించాడు. వేధింపులే కాకుండా పెళ్లిని ...

news

అమెరికా వెన్నులో వణుకు... డోనాల్డ్ ట్రంప్‌కు కిమ్ జాంగ్ ఉన్ షాక్... అణు పరీక్ష సక్సెస్

అమెరికా వెన్నులో వణుకు మొదలైంది. ప్రపంచాన్ని వణికించి, పెద్దన్నగా చెలామణి అవుతున్న ...

news

వడ్డీ చెల్లించలేదని వాచ్‌మెన్ భార్యను ఎత్తుకెళ్లిపోయారు.. పోలీసులు రంగంలోకి దిగి?

కాల్ మనీ ఉదంతం తరహాలోనే హైదరాబాదులో ఘోరం జరిగింది. అప్పు చెల్లించలేదని వడ్డీ వ్యాపారి తన ...

news

యేడాదిలో 2 సార్లు మాత్రమే సీఎం కార్యాలయానికి వస్తారు : కేజ్రీవాల్‌పై కపిల్ మిశ్రా

ఆమ్‌ ఆద్మీ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన ఢిల్లీ మాజీ మంత్రి కపిల్‌ మిశ్రా మరోమారు ఢిల్లీ ...

Widgets Magazine