శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : శుక్రవారం, 1 ఆగస్టు 2014 (10:40 IST)

ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు దుర్వినియోగం : చంద్రబాబు

ఎస్సీ సబ్ ప్లాన్ కోసం కేటాయించిన నిధులను ఔటర్ రింగ్ కోసం కేటాయించారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. హైదరాబాదులో ఇవాళ మానవ వనరుల శాఖపై చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... 2312 సాంఘిక సంక్షేమ వసతి గృహాలు ఉంటే... వాటిని తగ్గించేశారన్నారు. 
 
సాంఘిక సంక్షేమ వసతి గృహాలకు పిల్లలు రాకుండా చేశారన్నారు. ఎవరైనా హాస్టల్స్‌కు వచ్చినా, అక్కడ ఉండే పరిస్థితి లేదన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ సబ్‌ప్లాన్‌కు కేటాయించిన సొమ్మును ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి ఖర్చు పెట్టారని ఆరోపించారు. 2011 నుంచి బీసీ కమీషన్ ఖాళీగా ఉందన్నారు. ప్రజా సంక్షేమాన్ని కాంగ్రెస్ పూర్తిగా నిర్లక్ష్యం చేసిందన్నారు. 
 
చదువుకు అధిక ప్రాధాన్యత ఇస్తామని ఆయన అన్నారు. పిల్లలను బాల కార్మికులుగా మార్చేందుకు వీల్లేదని, చదువుకునే వయస్సున్న పిల్లలందరి వివరాలను కంప్యూటరైజ్డ్ చేస్తామని చంద్రబాబు చెప్పారు. పిల్లల్లో చదువు పైన మక్కువ పెంచేలా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.