గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : ఆదివారం, 5 జులై 2015 (11:21 IST)

మగ పిల్లాడైతే రూ.5లక్షలు.. ఆడపిల్లలైతే రూ.3లక్షలు: గుట్టుచప్పుడు కాకుండా..

సెల్ఫ్ హెల్ఫ్ అండ్ రూరర్ ఎడ్యుకేషన్ పేరిట స్వచ్ఛంధ సంస్థ తెరచిన తంబీ అనే వ్యక్తి పసిపిల్లలను విక్రయిస్తూ పోలీసులకు చిక్కుకున్నాడు. ముక్కుపచ్చలారని మగ పిల్లాడి ధరను రూ.5లక్షలుగా నిర్ణయించిన అతడు, ఆడపిల్లలను రూ.3 ల7లకే విక్రయిస్తున్నాడు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు రంగంలోకి దిగిన పోలీసులు పిల్లలను విక్రయిస్తున్న తంబీ రెడ్ హ్యాండెడ్‌గా అరెస్ట్ చేశారు. 
 
పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం ఏలూరులో కొంతకాలంగా సాగుతున్న ఈ అక్రమ దందాకు పోలీసులు చెక్ పెట్టేశాడు. స్వచ్ఛంద సంస్థ పేరిట గ్రామాల్లో పర్యటిస్తున్న సెల్ఫ్ హెల్ప్ అండ్ రూరల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ తంబీ, గుట్టుచప్పుడు కాకుండా పసిపిల్లలను విక్రయిస్తున్నాడు.