Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

నరేష్‌-స్వాతి లవ్ స్టోరీ : స్వాతి మరణిస్తూ సెల్ఫీ వీడియోలో ఏం చెప్పిందంటే?

ఆదివారం, 21 మే 2017 (15:09 IST)

Widgets Magazine
swathi love story

తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో సంచలనం సృష్టించిన నరేష్‌-స్వాతి జంట వ్యవహారం కొత్త మలుపులు తిరుగుతోంది. దీనిపై రోజుకో విషయం బయటపడుతోంది. అటు.. నరేష్‌ అదృశ్యం కావడం, ఇటు.. స్వాతి ఆత్మహత్య చేసుకోవడం, మరోవైపు.. ఈ కేసు విచారణ కోర్టులో ఉండటం వంటి పరిణామాల నేపథ్యంలో.. కొత్తగా స్వాతి సెల్ఫీ వీడియో బయటకు వచ్చింది. ఈ సెల్ఫీ వీడియోలో... 
 
తన చావుకు తన తల్లి దండ్రులు కారణం కాదని చెప్పింది. తన చావుకు తన అత్తింటి వారేనని పేర్కొంది.. దీనికి తోడుగా డబ్బుల కొసమే తనను నరేష్ ప్రేమించినట్లుగా నటించి మోసం చేశాడని.. డబ్బుల కొసమే తనను వివాహం చేసుకున్నాడని తెలిపింది. తాను పెద్దలను ఎదిరించి వివాహం చేసుకున్నానని.. అయినా తన తల్లి దండ్రులు ఏమి అనలేదని. కనీసం తర్వాత తాను ఇంటికి వచ్చినా తల్లిదండ్రులు బాగా చూసుకున్నారని వీడియోలో చెప్పింది. 
 
రెండో సారి తన తన తల్లి దండ్రులు ముంబై వెళ్లొద్దు అన్నప్పటికీ తిరిగి తాను నరేష్ వద్దకు వెళ్లానని.. అక్కడికి వెళ్లిన తరువాత తన అత్త మామలు చిత్రహింసలకు గురి చేశారని తెలిపింది. అదే సమయంలో తన ఆస్తి పాస్తుల గురించి నరేష్ నిత్యం ఆరా తీసే వాడని. తన అక్కకు ఎంత కట్నం ఇచ్చారని..? నాకు మీ తల్లి దండ్రులుఎంత కట్నం ఇస్తారని? పదేపదే అడిగే వాడని.. స్వాతి ఈ వీడియోలో పేర్కొంది. 
 
తనకు 35 లక్షల వరకు కట్నం కింద ఇస్తారని కూడా తాను చెప్పానని స్వాతి వెల్లడించింది. రెండు నిమిషాల పన్నెండు సెకన్లు వున్న ఈ వీడియోలో తన మరణం గురించి పూర్తి వివరాలను తెలిపింది.. అయితే ముందుగా ఎలాంటి సూసైడ్ నోట్ గాని. ఎలాంటి సెల్ఫీ వీడియోలు లేవని చెప్పిన పోలీసులు ఇప్పడు ప్రత్యక్షమైన ఈ వీడియోపైన విచారణ చేస్తున్నారు. మరొక వైపు నరెష్‌ మిస్సింగ్ కేసు ఇప్పడు హైకోర్టులో విచారణ జరుగుతుంది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

బీజేపీతో పొత్తువల్ల తీవ్రంగా నష్టపోయా : టీడీపీ ఎంపీ కేశినేని నాని

గత ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోవడం వల్ల తీవ్రంగా నష్టపోయానని, తనకు ...

news

వేట కొడవళ్ళతో వెంటాడి.. వేటాడి.. వైకాపా నేత దారుణ హత్య

కర్నూలు జిల్లాలో రాజకీయ కక్షలు భగ్గుమన్నాయి. నిన్నమొన్నటి వరకు ప్రశాంతంగా ఉన్న ఈ జిల్లాలో ...

news

జనసేన పార్టీలో హోదాలు ఉండవ్.. అందరూ కార్యకర్తలే... పవన్ కళ్యాణ్‌కు కూడా...

జనసేన పార్టీ జిల్లా వ్యాప్తంగా నిర్వాహకుల ఎంపిక కోసం వినూత్న రీతిలో టాలెంట్ పరీక్షలు ...

news

కారుని బైక్ రాసుకుందని వైద్యుడిని కాల్చిపారేశాడు... ఎక్కడ?

హర్యానాలో ఓ దారుణం జరిగింది. కారును బైక్ రాసుకుందని ఓ వైద్యుడిని తుపాకీతో కాల్చి ...

Widgets Magazine