మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pyr
Last Modified: బుధవారం, 4 మార్చి 2015 (06:42 IST)

నిర్మాతను అరెస్టు చేశారు.. యాంకర్ పై వేధింపులు

ఓ సీరియల్ నిర్మాత రోడ్డు సైడు రోమియోగా మారారు. నిత్యం తన వెకిలి చేష్టలు, అసభ్య పదజాలంతో ఓ యాంకర్ ను వేధించడం మొదలు పెట్టాడు. సినీ, బుల్లితెర రంగాలలో ఇలాంటి మామూలేనని కొన్నాళ్ళు సర్దుకుపోయిన యాంకర్ కు ఇక టాలరెన్స్ కెపాసిటీ తగ్గిపోయింది. భరించలేక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సీరియల్ నిర్మాత కటకటాలు లెక్కిస్తున్నాడు. 
 
తాజాగా ఓ నిర్మాత తనను లైంగికంగా వేధిస్తున్నాడంటూ ఓ మహిళా యాంకర్ హైదరాబాద్‌లోని సంజీవ రెడ్డి నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఇచ్చిన వివరాల ప్రకారం కేసు నమోదు చేసుకున్న పోలీసులు టీవీ సీరియళ్లు తీసే ఓ నిర్మాతను అదుపులోకి తీసుకున్నారు. 
 
ఒక ప్రైవేటు టీవీ ఛానల్లో యాంకర్‌గా పని చేస్తున్న ఆ మహిళా యాంకర్‌ను రోజు ఆ నిర్మాత లైంగికంగా వేధిస్తున్నట్టు పోలీసులకు ఫిర్యాదు చేసి బోరున విలపించింది. పోలీసులు ఆ నిర్మాత వద్ద విచారణ జరుపుతున్నారు. కాగా ఈ కేసు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.