బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : మంగళవారం, 28 ఏప్రియల్ 2015 (12:32 IST)

శేషాచలం ఎన్‌కౌంటర్‌ : హైకోర్టు ఆధీనంలోకి సిట్!

చిత్తూరు జిల్లాలోని శేషాచల అడవుల్లో జరిగిన ఎర్రచందనం స్మగ్లర్ల ఎన్‌కౌంటర్ ఘటనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు తన పరిధిలోకి తీసుకుంది. ఈ మేరకు కోర్టు మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 
 
అంతేకాకుండా, ఈ కాల్పుల ఘటనపై రెండు నెలల్లో (60 రోజులు)గా దర్యాప్తు పూర్తి చేయాలని సిట్‌ను ఆదేశించింది. ఈ క్రమంలో న్యాయస్థానం ఆధ్వర్యంలో శేషాచలం ఎన్‌కౌంటర్ దర్యాప్తు పూర్తి స్థాయిలో జరుగనుంది. కాగా సిట్‌లో ఉన్న సభ్యులపై అభ్యంతరాలుంటే ప్రమాణ పత్రం దాఖలు చేయాలని న్యాయస్థానం ప్రభుత్వాన్ని ఆదేశించింది. 
 
దేశ వ్యాప్తంగా ఈ కాల్పుల ఘటన సంచలనమైన విషయం తెల్సిందే. దీంతో హైకోర్టుతో పాటు.. జాతీయ మానవ హక్కుల సంఘం జోక్యం చేసుకుని విచారణ జరుపుతున్నాయి. ఈ నేపథ్యంలో.. సిట్‌ను హైకోర్టు తన పరిధిలోకి తీసుకోవడం గమనార్హం.