శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 27 ఫిబ్రవరి 2015 (11:22 IST)

జూన్‌లోపు రాజధాని మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తాం: సింగపూర్ గ్రూప్

జూన్‌లోపు ఏపీ రాజధాని మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తామని సింగపూర్ విదేశీ వ్యవహారాల మంత్రి కే షణ్ముగం తెలిపారు. ఏపీ రాజధాని పైన సీఎం చంద్రబాబు పూర్తి స్పష్టతతో ఉన్నారని షణ్ముగం వెల్లడించారు.

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి సింగపూర్ విదేశీ వ్యవహారాల మంత్రి కే షణ్ముగం, ఏపీ మంత్రులు నారాయణ, కామినేని శ్రీనివాస్ తదితరులు శుక్రవారం ఉదయం దర్శించుకున్నారు. దర్శనం అనంతరం మంత్రి షణ్ముగం మాట్లాడారు. జూన్‌లోపు రాజధాని మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తామన్నారు.
 
మంత్రి నారాయణ మాట్లాడుతూ.. మే 15 తర్వాత రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామన్నారు. రైతుల భాగస్వామ్యంతోనే రాజధాని అన్నారు. రైతులకు వ్యతిరేకంగా చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకోరని చెప్పారు. రాజధాని నిర్మాణానికి ల్యాండ్ పూలింగ్ ద్వారానే భూమి సేకరిస్తామన్నారు. 
 
మరోవైపు, రాజధానిపై ఏపీ స్పీడ్ పెంచింది. కాగా, గురువారం నాడు ఏపీ సీఎం చంద్రబాబు, సింగపూర్ ప్రతినిధి గోపినాథ్ పిళ్లై, సింగపూర్ మంత్రి షణ్ముగం తదితరులు భేటీ అయి రాజధానిపై చర్చించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ఆకట్టుకునే రాజధానిని నిర్మిస్తామని చెప్పారు. త్వరలో రాజధాని పేరు ప్రకటిస్తామన్నారు.