Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

పాము తలనే నోట్లో పెట్టుకునే మొనగాడు...

సోమవారం, 31 జులై 2017 (09:23 IST)

Widgets Magazine
snake-catcher

సాధారణంగా పామును చూస్తే ప్రాణభయంతో దౌడుతీస్తాం. పైగా, దాని వద్దకు వెళ్లాలన్నా.. పట్టుకోవాలన్నా భయంతో వణికిపోతారు. కానీ, అలాంటి విషసర్పాన్ని పట్టుకోవడమే కాదు.. దాంతో సరదాగా ఆడుకునేవారూ ఉన్నారు. అంతేకాదండోయ్.. ఆ విష సర్పం తలను ఏకంగా నోట్లో కూడా పెట్టుకుంటాడు. అతనిపేరు రామాంజనేయులు. అనంతపురం జిల్లా పెనుకొండ మండలం హరిపురం గ్రామవాసి. 
 
ఈ ప్రాంతంలో ఎక్కడ పాము కనిపించినా ఆయన్నే పిలుస్తారు. ఎంతటి విషపూరితమై పామునైనా అవలీలగా పట్టేస్తాడు. ఎంతటి పెద్దదైనా చేతిలో చుట్టేస్తాడు. ఆ తర్వాత దాంతో అతడు చేసే విన్యాసాలు ఒళ్లు గగుర్పొడుస్తాయి. దానిని చేతిలో పట్టుకుని, అటూఇటూ తిప్పుతాడు. విషపూరితమైన దాని తలను ఏకంగా నోట్లోనే పెట్టుకుంటాడు. 
 
దీనిపై ఆయన స్పందిస్తూ 13 ఏళ్ల క్రితం కేరళకు చెందిన ఓ ముస్లిం గురువువద్ద పాములు పట్టే విద్య నేర్చుకున్నాను. పాముకాటుకు గురైన వారికి ఆయుర్వేద మందు తయారు చేసి, ఉచితంగా వైద్యం చేస్తాను. పాములు పట్టిన చోట తోచింది ఇస్తే.. దాంతో జీవనం సాగిస్తుంటాను. ప్రస్తుతం పరిస్థితి మారిపోయిందని, తనను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నాడు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Snake Snake-catcher Anantapur

Loading comments ...

తెలుగు వార్తలు

news

పాకిస్థాన్ ప్రజలంతా నిజాయితీపరులా? నవాజ్ షరీఫ్ ప్రశ్న

తన దేశ ప్రజలను కించపరిచేలా పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ సంచలన వ్యాఖ్యలు ...

news

తప్పు చేసింది మీరు.. మీకు క్షమాపణలు చెప్పాలా.. నెవర్ అంటున్న డీఐజీ రూప

పరప్పన జైల్లో శిక్షననుభవిస్తున్న అన్నాడీఎంకే నాయకురాలు శశికళకు అక్రమంగా వసతులు ...

news

రేపిస్టునే పెళ్లాడిన 14 యేళ్ల మైనర్ బాలిక... కారణం...

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకేకాదు.. మైనర్ బాలికలకు కూడా ఏమాత్రం రక్షణ లేకుండా పోయింది. ...

news

తస్మదీయులపై కేసుల మీద కేసులు.. అస్మదీయులపై కొట్టివేతలు.. ఇదేం న్యాయం మిలార్డ్

రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి తన ప్రత్యర్థులపై అయినదానికి, కానిదానికి ...

Widgets Magazine