Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఏపీ హీరోగా మారిన గల్లా జయదేవ్: మిస్టర్‌ ప్రైమ్‌‌, మిస్టర్‌ ఫైనాన్స్‌ స్పీచ్ వైరల్

శనివారం, 10 ఫిబ్రవరి 2018 (14:37 IST)

Widgets Magazine
galla jayadev

తెలుగు దేశం పార్టీ గల్లా జయదేవ్ హీరో అయిపోయారు. విభజన హామీలను నెరవేర్చడంతో కేంద్ర ప్రభుత్వం విఫలమైందంటూ నిరసనలు చేపట్టిన టీడీపీ ఎంపీల్లో ఒకరైన గల్లా జయదేవ్.. పార్లమెంట్‌లో ఇచ్చిన స్పీచ్‌తో అదుర్స్ అనిపించుకున్నారు. విభజన హామీల వైఫల్యంపై కేంద్రాన్ని తన ప్రసంగం ద్వారా నిలదీశారు. పార్లమెంట్‌లో గల్లా జయదేవ్ ఇచ్చిన స్పీచ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీలను సూటిగా ప్రశ్నిస్తూ గల్లా జయదేవ్ చేసిన ప్రసంగానికి అమాంతం క్రేజ్ వచ్చేసింది. ఇంకా ఢిల్లీ పెద్దలను ప్రశ్నించడంతో ఏమాత్రం వెనక్కి తగ్గని గల్లా జయదేవ్‌కు గుంటూరులో ఘన స్వాగతం పలికేందుకు రంగం సిద్ధమవుతోంది. గుంటూరుకు వచ్చే ఆయనను అభినందిస్తూ గుంటూరు టీడీపీ శ్రేణులు సర్వం సిద్ధం చేశాయి. 
 
పార్లమెంట్‌లో ఇంగ్లీష్‌లో అదరగొట్టిన.. మిస్టర్‌ ప్రైమ్‌ మినిష్టర్‌, మిస్టర్‌ ఫైనాన్స్‌ మినిష్టర్‌ అంటూ.. గల్లా చేసిన కామెంట్స్‌పై సోషల్ మీడియాలో నెటిజన్ల అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీ సీఎం చంద్రబాబు ఇప్పటికే ఎన్నోసార్లు ఎంపీలతో కలిసి ప్రధానితో సమస్యలను వివరించాలని ప్రసంగంలో జయదేవ్ ప్రస్తావించారు. కానీ రాజధానికి నిధులు ఇవ్వలేదని, అలాగే విశాఖకు రైల్వే జోన్ కూడా ప్రకటించలేదన్నారు. 
 
అలాగే ఏపీ ప్రజలు ఫూల్స్ కాదని.. ఏపీ ప్రజలను మళ్లీ మళ్లీ మోసం చేస్తున్నారని.. గతంలో ఏపీ ప్రజలకు హ్యాండ్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఎలాంటి గుణపాఠం చెప్పారో గుర్తు చేసుకోవాలని గల్లా జయదేవ్ పేర్కొన్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

సోదరుడు ఎదుటే అతడి చెల్లెలిపై అత్యాచారం చేసిన కామాంధుడు

సోదరుడి ఎదుటే అతడి సోదరిపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ కామాంధుడు. వివరాల్లోకి వెళితే... ...

news

దక్షిణ కొరియాకు సోదరి, ప్రేయసి.. ఉత్తర కొరియా చీఫ్ కిమ్ పక్కా ప్లాన్?

దక్షిణ కొరియా, ఉత్తర కొరియాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న సంగతి తెలిసిందే. ఈ ...

news

రామమందిరం కోసం గెలిపిస్తే.. ట్రిపుల్ తలాక్‌‌ను చట్టం చేస్తారా?: ప్రవీణ్ తొగాడియా

వీహెచ్‌పీ అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా కేంద్రంలోని బీజేపీ సర్కారును ఎండగట్టారు. బీజేపీకి ...

news

ఏంజెల్ ఇన్వెస్టర్ మహేష్ మూర్తి అరెస్ట్.. సోషల్ మీడియాలో లైంగిక వేధింపులు..

ఏంజెల్ ఇన్వెస్టర్ మహేష్ మూర్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. సోషల్ మీడియా ద్వారా ఓ ఢిల్లీ ...

Widgets Magazine