శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pyr
Last Updated : గురువారం, 2 జులై 2015 (09:13 IST)

అంతాస్తి దానం చేస్తాడ‌ట‌... ఎంతాస్తి...?

వివిధ ర‌కాలుగా జ‌నాన్ని చైత‌న్యప‌ర‌చ‌డానికి ఆయ‌న త‌న‌కున్న ఆస్తినంతా దానం చేస్తారట‌.. ఇది మామూలు మాట మాత్ర‌మే కాదు. ప్ర‌తిజ్ఞ కూడా చేశారు. ఇంత‌కీ అంత పెద్ద దాన‌క‌ర్ణుడు ఎవ‌రా అని ఆలోచిస్తున్నారు క‌దూ.. ఆయ‌న సౌదీ రాజు... ఈ రాజు ద‌గ్గ‌ర ఎంత ఆస్తి ఉందో అనే అనుమానం వెంట‌నే క‌లుగుతుంది. ఎంతుందేటి? ఆ.. ఎంత సింపుల్ గా రూ. 2 ల‌క్ష‌ల కోట్లు... ఊ... రెండు ల‌క్ష‌ల కోట్లే... అవును ఆ ఆస్తినంతా దానం చేస్తాన‌ని ప్రతిబూనాడు. 
 
ప్రపంచ కుబేరుల్లో ఒకరైన సౌదీ యువరాజు అల్వలీద్‌ బిన్‌ తలాల్ తన యావదాస్తిని దానం చేస్తానని ప్రతిజ్ఞ చేశారు. అక్షరాల రూ.2లక్షల కోట్లును దానం చేస్తాన‌ని బుధవారం ఆయన ఈ మేరకు ప్రతిజ్ఞ చేశారు. సాంస్కృతిక అవగాహన పెంపొందించడం, కమ్యూనిటీల అభివృద్ధి, యువత శక్తి సామర్థ్యాలు మెరుగుపరచడం, ప్రకృతి విపత్తులలో సహాయ కార్యక్రమాలు చేపట్టడం, మరింత ఉన్నతమైన ప్రపంచ నిర్మాణం కోసమే నేను నా ఆస్తినంతా దానం చేయాలని నిర్ణయించుకున్నానని పేర్కొన్నారు. 
 
అయితే ఇప్పటికిప్పుడే తన ఆస్తిని విరాళంగా ఇవ్వబోనని.. నిర్దిష్ట ప్రణాళికను రూపొందించి దాని ప్రకారం ముందడుగు వేస్తానని పేర్కొన్నారు. దానికి ఎలాంటి కాలపరిమితి లేదని స్పష్టం చేశారు. మానవతా దృక్పథంతో చేపట్టే పలు కార్యక్రమాలు తన మరణానంతరం కూడా కొనసాగేలా చర్యలు చేపట్టనున్నట్లు చెప్పారు. ఈ ఏడాది జనవరి 23న మరణించిన సౌదీరాజు అబ్దుల్లా మేనల్లుడే ఈ తలాల్‌.