శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pyr
Last Modified: శుక్రవారం, 27 మార్చి 2015 (11:26 IST)

ఎన్ఆర్ఐల కోసం ప్రత్యేక శాఖ... బోగస్ ఏజెంట్లతోనే నష్టాలు : పల్లె

ప్రవాసభారతీయుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోందనీ, వారి సమస్యల పరిష్కారానికి ప్రత్యేకమైన డిపార్టుమెంటు ఉందని రాష్ట్ర ఐటి మంత్రి పల్లె రఘునాథరెడ్డి తెలిపారు. గ్రామీణ ప్రాంతాలలోని పలువురు పేదల నకిలీ ఏజంట్లను నమ్మడం వలననే వారు ఇబ్బందులు పడాల్సి వస్తోందని తెలిపారు. ఎక్కడ ఎటువంటి కష్టనష్టాలు వచ్చినా ఇక్కడ నియమితులైన లైజనింగ్ అధికారికి ఫిర్యాదు చేయవచ్చునని తెలిపారు. 
 
గల్ఫ్ దేశాలలలో అవకాశాలు కల్పిస్తామంటూ మహిళలను తీసుకెళ్లి అక్కడ వ్యభిచార కూపాలలోకి పంపడంపై కడప జిల్లా రైల్వే కోడూరు ఎమ్మెల్యే శ్రీనివాసులుతోపాటు పలువురు ఎమ్మెల్యేలు లేవనెత్తిన ప్రశ్నలపై శుక్రవారం శాసనసభలో పల్లె రఘునాథరెడ్డి సమాధానం ఇచ్చారు. ప్రపంచం ఎక్కడ ఎటువంటి ఇబ్బంది జరిగినా తమ ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించి వారిని తిరిగి ఉచితంగా దేశానికి పిలిపిస్తున్నామని తెలిపారు.
 
అంతర్యుద్ధంతో రగిలిపోతున్న దేశాలను నుంచి ఎంతో మందిని సురక్షితంగా వెనక్కి పిలిపించినట్లు తెలిపారు. అయినా సరే ఎన్నారైల కోసం ప్రత్యేక సెల్ కాకపోయిన ప్రత్యేకమై డిపార్టుమెంటును ఏర్పాటు చేసినట్లు వివరించారు. దానిని తన మంత్రిత్వ శాఖ కిందకు చేర్చారని తెలిపారు. ఈ విభాగంలో ఫిర్యాదు స్వీకరించడానికి లైజనింగ్ అధికారిని నియమించడం జరిగిందన్నారు. ఆన్ లైన్ ద్వారా కూడా ఫిర్యాదులు స్వీకరిస్తున్నామని తెలిపారు. ఎవరికైనా ఇబ్బంది కలిగితే ఆ విభాగాన్ని సంప్రదించవచ్చునని తెలిపారు.