గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 15 ఏప్రియల్ 2016 (11:01 IST)

శ్రీరామనవమి ముందు వర్షం.. 95 ఏళ్లుగా ఆ ఊళ్లల్లో విశేషం.. ఎక్కడ?

తెలుగు రాష్ట్రాలు భానుడి ప్రతాపంతో అల్లాడిపోతుంటే.. మరోవైపు తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా కందుకూరు మండల పరిధి రాచలూరు, లేమూరు, కందుకూరు, మకాన్‌ తదితర గ్రామాల్లో గురువారం మధ్యాహ్నం ఓ మోస్తరు వాన కురిసింది. మామూలుగా అయితే అదో పెద్ద విశేషం కాదు. కానీ.. ఆ ఊళ్లల్లో 95 ఏళ్లుగా ఇలా ఏటా శ్రీరామనవమి ముందురోజు వర్షం కురుస్తుంది. అలాగే ఈ ఏడాది కూడా ఆనవాయితీ కురిసింది. దీంతో.. ఆ శ్రీరామచంద్రుడి కృప తమపై ఉందని ఆయా గ్రామాల ప్రజలు హర్షం వెలిబుచ్చారు.
 
ఇదిలా ఉంటే.. శ్రీరామనవమి శోభయాత్రకు నగర పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సుమారు 6.5 కిలోమీటర్ల మేర 250 సీసీ కెమెరాలను అమర్చారు. వీటితో పాటు మౌంటెడ్ కెమెరా వాహనాలను ఉపయోగిస్తున్నారు. సీతారాంబాగ్ నుంచి అఫ్జల్‌గంజ్, గౌలిగూడ వరకు కొనసాగే ప్రధాన ర్యాలీ పొడవునా గట్టి నిఘా పెట్టారు. సీసీ కెమెరాలను నగర కమిషనరేట్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానం చేసి ర్యాలీ పూర్తయ్యే వరకు ఉన్నతాధికారులు పరిశీలించనున్నారు. గతేడాది నవమి వేడుకల్లో భాగంగా జరిగిన శోభయాత్రను సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షించారు.