శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 14 అక్టోబరు 2020 (20:41 IST)

16 నుంచి ఏకాంతంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఆలయంలోనే ఏకాంతంగా జరగనున్నాయి. ఈ ఏడాది అధికమాసం కావడంతో స్వామివారికి రెండు సార్లు బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నారు.

గత నెలలో నిర్వహించిన వార్షిక ఉత్సవాలను ఏకాంతంగా ఆలయంలోనే నిర్వహించిన తితిదే.. ఈ నెల 16 నుంచి 24వ తేదీ వరకు జరగనున్న నవరాత్రి ఉత్సవాలను తిరువీధుల్లో భక్తుల మధ్య నిర్వహించాలని ముందుగా భావించి అందుకు తగిన ఏర్పాట్లు చేసింది.

అయితే, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తాజాగా వెల్లడించిన కొవిడ్‌-19 నిబంధనలకు అనుగుణంగా నవరాత్రి ఉత్సవాలను ఈసారి కూడా  ఏకాంతంగానే నిర్వహించనునన్నట్లు మంగళవారం తితిదే ప్రకటించింది. ఈవో జవహర్‌రెడ్డి అధ్యక్షతన తితిదే ఉన్నతాధికారులు పలు మార్లు సమీక్షలు నిర్వహించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తితిదే తెలిపింది.

చిత్తూరు జిల్లాలో కరోనా పాజిటీవ్ కేసులు పెరుగుతుండటం.. ఉత్సవాలు, మతపరమైన కార్యక్రమాలకు 200 మందికి మించి నిర్వహించకూడదని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ నూతన మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు  స్పష్టం చేశారు.