Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఇన్ఫోసిస్‌పై విరుచుకుపడ్డ ఉద్యోగులు: వణికి చావొద్దన్న సీఈఓ

హైదరాబాద్, ఆదివారం, 5 ఫిబ్రవరి 2017 (02:19 IST)

Widgets Magazine
infosys

పుణేలోని ఇన్సోసిస్ సంస్థ కార్యాలయంలో ఒంటిరిగా రాత్రిపూట పనిచేస్తున్న ఉద్యోగిని దారుణ నేపథ్యంలో సంస్థ భద్రతా ప్రమాణాలపై తోటి ఉద్యోగులు విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. భద్రతా ప్రమాణాలపై దాదాపు 9 వేల సూచనలను సంస్థ ఉద్యోగులు పంపిన నేపథ్యంలో ఉద్యోగులకు పని పంపిణీ విధానాన్ని సమూలంగా మార్చివేయడం గురించి ఆలోచిస్తున్నామని బయటనుంచి ఒక భద్రతా సలహాదారుచే సమీక్ష జరుపుతున్నామని ఇన్ఫోసిస్ ప్రకటించింది.
 
పుణేలోని ఇన్పోసిస్ ఆఫీసులో వారాంతంలో ఒంటరిగా పనిచేస్తున్న రసిలా రాజు అనే ఉద్యోగినిని సంస్థ భద్రతా గార్డే చంపివేయడంతో ఇతర ఉద్యోగులు భయాందోళనలు వ్యక్తం చేయడం, ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం కలిగించడం తెలిసిందే. దీంతో సంస్థ ఉద్యోగులలో ఆత్మస్థయిర్యాన్ని నిలిపేందుకు ఇన్ఫోసిస్ ప్రయత్నిస్తోంది. 
 
ఇన్పోసిస్ సీఈవో ప్రవీణ్ రావు సంస్థ సిబ్బందికి ఈమెయిల్ ద్వారా ఉత్తరం పంపుతూ జరిగిన ఘటనతో వణికిపోవద్దని, పరిస్థితులు చక్కబడేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. జరిగిన ఘటన మిమ్మల్నందరినీ కదిలించివేసిందని మేము అర్థం చేసుకుంటున్నాం. మన కంపెనీలోనే మీకు పూర్తి కలిగిస్తామని హామీ ఇస్తున్నాను. మన క్యాంపస్ సురక్షితంగా ఉంటుందని, ఉద్యోగుల భద్రతే మా ప్రధమ ప్రాధమ్యంగా ఎంచుతున్నామని ప్రవీణ్ చెప్పారు. 
 
ఒకే మనిషి పనిచేయవలసిన సందర్భంలో ఉద్యోగులకు పని పంపిణీని పునఃపరిశీలిస్తున్నామని, అనివార్యంగా మహిళలు పనిచేయవలసిన పరిస్థితుల్లో అదనపు భద్రతాచర్యలు చేపడతామని సంస్థ భరోసా ఇచ్చారు, అదనపు భద్రతా సలహాదారు సహాయం తీసుకుంటామని, సంస్థ భవనాల్లో అలారం బటన్‌లను ఏర్పరుస్తామని, శీఘ్ర స్పదనా బృందాలను ఏర్పరుస్తున్నామని చెప్పారు. 
 
అంతకుమించి ఇంటినుంచి పనిచేసే సౌకర్యం, ల్యాప్‌టాప్‌లు ఇవ్వడం సాధ్యమైన ప్రతిచోటా ఏర్పాటు చేస్తామని రావు చెప్పారు. మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చేలా చర్యలు త్వరలో చేపడతామని వివరించారు
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ప్రపంచ కేన్సర్ దినోత్సవం... 5 లక్షల మందికి పరీక్షలు నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం

ప్రపంచం వ్యాప్తంగా అనేకమంది క్యాన్సర్ వ్యాధి బారినపడుతున్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతమని ...

news

ట్రంప్ ఆంక్షల్ని అమలు చేయడం అంత సులభం కాదు.. ''టి'' ప్రజల కోసం ఢిల్లీకి వెళ్తా: కేటీఆర్

ప్రపంచ దేశ ప్రజలు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. వీసా ...

news

కుషన్ కుర్చీలో శశికళ... చెక్క కుర్చీపై సీఎం సెల్వం... పతనం ప్రారంభమైనట్టేనా?

తమిళనాడులో రాజకీయ రంగులు మారడం ఆగటంలేదు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత తర్వాత ఆ సీటుపై శశికళ ...

news

ప్రధాని మోదీకి భంగపాటు ఖాయమా...? యూపీ, పంజాబ్, గోవాల్లో కమలం వాడుతుందట....

ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భంగపాటు ఖాయమని ఆర్జేడీ చీఫ్ లాలూ ...

Widgets Magazine