శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 21 జులై 2016 (07:34 IST)

ఉదయం వాకింగ్ వెళ్తూ వెళ్తూ.. రైల్వే ట్రాక్‌పై నిల్చుని సెల్ఫీ.. రైలు కింద పడి విద్యార్థి మృతి!

సోషల్ మీడియా ప్రభావంతో సెల్ఫీ పిచ్చి బాగా ముదిరిపోతోంది. ఎక్కడిపడితే అక్కడ సెల్ఫీలు దిగేసి ఆ ఫోటోలను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడం ప్రస్తుతం యువత ఫ్యాషనైపోయింది. అయితే సెల్ఫీలతో ప్రాణాపాయం ఉన్న సంగతిన

సోషల్ మీడియా ప్రభావంతో సెల్ఫీ పిచ్చి బాగా ముదిరిపోతోంది. ఎక్కడిపడితే అక్కడ సెల్ఫీలు దిగేసి ఆ ఫోటోలను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడం ప్రస్తుతం యువత ఫ్యాషనైపోయింది. అయితే సెల్ఫీలతో ప్రాణాపాయం ఉన్న సంగతిని ఏ మాత్రం గుర్తించుకోవట్లేదు. సెల్ఫీలతో ప్రమాదముందని తెలిసినా.. లైకులు, షేర్ల కోసం ప్రస్తుత యువత పాకులాడుతోంది. తాజాగా సెల్ఫీ పిచ్చితో మరో యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. 
 
రైల్వే ట్రాక్‌పై నిల్చుని సెల్ఫీకి ప్రయత్నించి ప్రాణాలపైకి తెచ్చుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. రైల్వే ట్రాక్‌పై సెల్ఫీకి యత్నించిన ఇంజనీరింగ్ విద్యార్థి బాషా రైలు ఢీకొనడంతో దుర్మరణం చెందినట్లు పోలీసులు తెలిపారు. కర్నూలు జిల్లాలోని పాణ్యం మండలం పెరవాడ గ్రామ సమీపంలోని రైల్వే ట్రాక్‌పై ఈ ఘటన చోటు చేసుకుంది. 
 
ఉదయం వాకింగ్ వెళ్లిన బాషా ఎదురుగా వస్తున్న రైలు పక్కన సెల్ఫీతో పోటో దిగేందుకు యత్నించాడు. కానీ రైలు వేగాన్ని గమనించలేకపోయిన ఆ యువకుడు.. సెల్ఫీ మోజులో పడి రైలు వేగాన్ని గుర్తించకపోవడంతో దానికిందే పడి ప్రాణాలు కోల్పోయాడు. కాగా మృతి చెందిన బాషా ఇంజనీరింగ్ సెకండియర్ చదువుతున్నాడు. ఇతడు.. దొర్నిపాడు మండలం వాసిగా గుర్తించారు.