గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 22 నవంబరు 2014 (17:46 IST)

ఎన్టీఆర్ పేరును కేసీఆర్ కాదు.. ఆయన తాత వచ్చినా..?

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ డొమెస్టిక్ టెర్మినల్‌కు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పేరును కేసీఆర్ కాదు.. ఆయన తాత దిగివచ్చినా తొలగించలేరని కేంద్ర మంత్రి సుజనా చౌదరి అన్నారు. కేసీఆర్‌ తీరును ప్రపంచమంతా ఆక్షేపిస్తోందని మండిపడ్డారు. 
 
ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద ఒక రోజు దీక్షకు దిగిన మోత్కుపల్లితో సుజనా చౌదరి దీక్షను విరమింపజేశారు. ఈ సందర్భంగా సుజనా మాట్లాడుతూ ఎన్టీఆర్ పేరుపై తెలంగాణ శాసనసభలో ఇలాంటి తీర్మానాలు ఎన్ని చేసినా ఉపయోగం లేదన్నారు. 
 
1999లో ఎయిర్‌పోర్టుకు ఎన్టీఆర్‌ పేట్టాలన్న నిర్ణయంలో కేసీఆర్‌ కూడా భాగస్వామే అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సుజనా చౌదరి సూచించారు. ఎన్టీఆర్‌ తెలుగు ప్రజల ఆరాధ్యదైవమని ఆయన వ్యాఖ్యానించారు.