మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 30 మే 2016 (12:10 IST)

ఏపీ నుంచి రాజ్యసభకు సురేష్ ప్రభు.. చంద్రబాబు సమ్మతం

కేంద్ర రైల్వేశాఖామంత్రి సురేష్ ప్రభు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి రాజ్యసభకు వెళ్లనున్నారు. సురేష్ ప్రభును ఆంధ్రప్రదేశ్ నుంచి పంపిచేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమ్మతించారు. ఇదే అంశంపై తిరుపతిలో మూడురోజుల పాటు జరిగిన మహానాడు తర్వాత కూడా పొలిట్‌ బ్యూరో సమావేశాన్ని తిరుపతిలో నిర్వహించారు. ఆదివారం అర్థరాత్రి దాటిన తర్వాత కూడా పొలిట్‌ బ్యూరో సమావేశం జరుగుతూనే ఉంది. పార్టీకి చెందిన సీనియర్‌ నేతలు, కేంద్రమంత్రులు, ఏపీ మంత్రులు పొలిట్‌ బ్యూరో సమావేశానికి హాజరై రాజ్యసభ సీటుపై సుదీర్ఘంగా చర్చించారు. 
 
తెలుగుదేశం పార్టీ తరపున మాజీ మంత్రి పుష్పరాజ్‌, కేంద్రమంత్రి సుజనాచౌదరితో పాటు మరో మాజీ మంత్రి పేరును పరిశీనలో ఉంచారు. అదేసమయంలో ఏపీ నుంచి రాజ్యసభకు కేంద్ర రైల్వేశాఖామంత్రి సురేష్‌ ప్రభుకు తెదేపా పంపనుంది. ఇప్పటికే ఆయన పేరును పొలిట్‌ బ్యూరోలో ఖరారు కూడా చేసేశారు. బీజేపీతో పొత్తు కొనసాగించాంటే ఖచ్చితంగా సురేష్ ప్రభుకు రాజ్యసభ సీటు ఇవ్వాల్సిందే.