Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

దేవాలయాలకు ప్రత్యేక హోదా ఇవ్వాలి.. స్వామీజీల డిమాండ్

బుధవారం, 17 మే 2017 (12:28 IST)

Widgets Magazine
paripoornananda

వెనుకబడిన రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇవ్వాలన్నది గత చరిత్ర. ఇపుడు దేవాలయాలకు ప్రత్యేక ప్రత్యేక హోదా ఇవ్వాలన్నది నేటి డిమాండ్. ఆలయాల పాలక మండళ్ళలో రాజకీయ నేతల జోక్యం మితిమీరిపోయిందని, అందువల్ల ఆలయాలకు స్వయంప్రతిపత్తి లేదా ప్రత్యేక హోదా కల్పించాలని అనేకమంది స్వామీజీలు డిమాండ్ చేస్తున్నారు.
 
ఇదే అంశంపై శ్రీ పీఠం పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామి, జగద్గురు శంకరాచార్య, పుష్పగిరి శారద, లక్ష్మీ నృసింహ పీఠం పీఠాధిపతి శ్రీ విద్యానృసింహ భారతి, మాతా నిర్మలానంద యోగా భారతి, వీహెచ్‌పీ అధ్యక్షుడు ఎం.రామరాజు, టీటీడీ సంరక్షణ సమితి ప్రధాన కార్యదర్శి ప్రొఫెసర్‌ మనోహరరావులు విలేకరులతో మాట్లాడుతూ.... తెలుగు రాష్ట్రాల్లో దేవాదాయ, ధర్మాదాయ చట్టం సక్రమంగా అమలు కావడంలేదన్నారు. 
 
భక్తుల కానుకలతో అధికారులు జీతాలు తీసుకుంటూ రాజకీయ నేతలకు సేవలు చేస్తున్నారని విమర్శించారు. ముస్లింలకోసం ఏర్పాటుచేసిన వక్ఫ్‌ బోర్డులో ప్రభుత్వ జోక్యం కేవలం 1 లేదా 2 శాతమేనని చెప్పారు. ఇక చర్చిలది స్వతంత్ర ప్రతిపత్తి అన్నారు. కానీ హిందూ దేవాలయాలలో మాత్రం ప్రభుత్వాలు మితిమీరి జోక్యం చేసుకుంటాయన్నారు. 
 
దేవాలయాలకు ప్రత్యేక హోదా కోసం అన్ని సంఘాలను ఏకంచేసి, ప్రజల్లో చైతన్యం తీసుకొస్తామని చెప్పారు. దేశవ్యాప్తంగా ఉన్న 34 వేల దేవాలయాలలో.. ఆదాయం వచ్చే 4 వేల దేవాలయాలకే ట్రస్ట్‌లు వేశారని, మిగతా వాటిని పట్టించుకోవడంలేదని విద్యానృసింహ భారతి ఆరోపించారు. దేవాలయాల పవిత్రతను కాపాడాలని వీహెచ్‌పీ అధ్యక్షుడు రామరాజు అన్నారుWidgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

పెళ్లికి కొన్ని గంటలే.. ఇంతలో వరుడు రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు.. ఎలా?

పెళ్లికి కొన్ని గంటలే మిగిలి వున్నాయి. వరుడు డీసీఎంలో పెళ్ళి మండపానికి బయల్దేరాడు. కానీ ...

news

సీఆర్‌పీఎఫ్ జవాన్ల ప్రతీకారం : 20 మంది మావోయిస్టులు మృతి

మావోయిస్టులపై సీఆర్‌పీఎఫ్ జవాన్లు ప్రతీకారం తీర్చుకున్నారు. బీజాపూర్‌ జిల్లాలో మంగళవారం ...

news

వాడు తండ్రి కాదు.. పాషాణ హృదయుడు... కుమార్తె చనిపోవడానికి 2 రోజుల ముందు లీగల్ నోటీస్

ప్లీజ్ నాన్నా... నా ఆరోగ్యం క్షీణించిపోతోంది.. ప్రతి రోజూ నరకం అనుభవిస్తున్నా... నన్ను ...

news

కొడనాడు ఎస్టేట్ వాచ్‌మెన్ హత్య కేసులో మరో ట్విస్ట్.. తుప్పుపట్టిన వాహనాలు..

కొడనాడు ఎస్టేట్ వాచ్‌మెన్ హత్య కేసులో అన్నాడీఎంకే చెందిన కవుండంపాళయం ఎమ్మెల్యే ఆరుకుట్టి ...

Widgets Magazine