శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Modified: గురువారం, 12 మే 2016 (22:27 IST)

షిర్డీ సాయిబాబా దేవుడు కాదు... ఆయనకు పూజలు చేయాల్సిన అవసరమేంటి?

షిర్డీ సాయిబాబా దేవుడు కారనీ, ఆయనకు పూజలు చేయాల్సిన అవసరం లేదనే చర్చ మరోమారు హీటెక్కిస్తోంది. షిర్డీ సాయిబాబా దేవుడు అని నిరూపిస్తానని రమణానంద మహర్షి అంటుంటే, సాయిబాబా దేవుడు కాదని గుజరాత్‌లోని ద్వారకా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి అన్నారు

షిర్డీ సాయిబాబా దేవుడు కారనీ, ఆయనకు పూజలు చేయాల్సిన అవసరం లేదనే చర్చ మరోమారు హీటెక్కిస్తోంది. షిర్డీ సాయిబాబా దేవుడు అని నిరూపిస్తానని రమణానంద మహర్షి అంటుంటే, సాయిబాబా దేవుడు కాదని గుజరాత్‌లోని ద్వారకా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి అన్నారు. 
 
వంద ప్రమాణాలతో సాయిబాబా దేవుడని నిరూపిస్తానని చెప్పిన రమణానంద... షిర్డీ సాయిబాబా దేవుడు కాదని స్వరూపానందేంద్ర నిరూపించగల్గుతారా అని సవాల్ విసిరారు. ఇదిలావుండగా ప్రముఖులు చాగంటి కోటేశ్వర రావు కూడా షిర్డీ సాయిబాబా దేవుడు కాదని అన్నారంటూ విజయవాడలో సాయి భక్తులు నిరశనకు దిగారు. గురువారం రాత్రి భక్తులు నిరసన చేపట్టారు. మరి షిర్డీ సాయిబాబా దేవుడా కాదా అనే చర్చ మరోసారి మొదలైంది.