గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : మంగళవారం, 16 సెప్టెంబరు 2014 (12:47 IST)

భారీ మెజార్టీ వస్తుందని ఊహించలేదు : తంగిరాల సౌమ్య

కృష్ణా జిల్లా నందిగామ ఉప ఎన్నికల్లో తాను విజయం సాధిస్తానని నామినేషన్ పత్రాలు దాఖలు చేసినపుడే తెలుసని, కానీ, ఇంత భారీ మెజార్టీ వస్తుందని తాను కలలో కూడా ఊహించలేదని టీడీపీ అభ్యర్థిగా విజయకేతనం ఎగురవేసిన తంగిరాల సౌమ్య చెప్పుకొచ్చారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ఆమె మాట్లాడుతూ.. తాను గెలుస్తానని తెలుసునని, మెజార్టీని మాత్రం ఊహించలేదన్నారు. తనను ఆదరించిన ప్రజలకు ధన్యవాదాలు చెప్పారు. 
 
నందిగామ శాసన సభ ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి తంగిరాల సౌమ్య తన ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి బోడపాటి బాబురావు పైన 74,827 ఓట్ల మెజార్టీతో గెలుపొందిన విషయం తెల్సిందే. స్థానిక కేవీఆర్ కళాశాలలో మొత్తం 15 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తి చేశారు. టీడీపీ అభ్యర్థి సౌమ్యకు 99,748, కాంగ్రెస్ అభ్యర్థికి 24,921, స్వతంత్ర అభ్యర్థులు పుల్లయ్య 941, పుల్లారావుకు 647 ఓట్లు వచ్చాయి. నోటాకు 1178 ఓట్లు పోలయ్యాయి. విజయం సాధించిన తంగిరాల సౌమ్యకు ఎన్నిక ధ్రవీకరణ పత్రాన్ని రిటర్నింగ్ అధికారి రజనీకాంతా రావు అందజేశారు.