శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Eswar
Last Modified: మంగళవారం, 29 జులై 2014 (13:17 IST)

తణుకులో చేపా పాముల హల్ చల్

వర్షాకాలం వచ్చిందంటే జలచరాల పరుగులకు అంతే ఉండదు. ముఖ్యంగా పాముల పరిస్థితి చెప్పనక్కర్లేదు. గోదావరి జిల్లాలలో అయితే ఎక్కడంటే అక్కడ పరుగులు పెడుతూనే ఉంటాయి. ఆ పరుగులు తీస్తూనే తమ ఆహారాన్ని నోట కరుచుకుని పోవటం సర్వసాధారణం. పిల్లి కనపడగానే ఎలుకలు, పాములు కనిపించగానే ఎలుకలతోపాటు కప్పలు, చేపలు వంటి జలచరాలు సైతం ఆమడదూరం పరుగెడతాయి.
 
పశ్చిమగోదావరి జిల్లా తణుకులో పాము చేపను మింగేసింది. చేప మాట ఎలా ఉన్నా, పాము పరిస్థితి మాత్రం విషమంగా మారింది. నోట మింగలేక, కక్కలేక నానా తంటాలు పడింది. పాములు చేపలను తినటం సర్వసాధారణమే అయినా, ఈ పాము నోట కరుచుకున్న చేపకు పొలుసుపైన సైతం ముళ్లుండటంతో పాముకు మింగుడు పడలేదు.
 
దానిని వదిలించుకోవటానికి ముళ్లు గొంతులో దిగాయో ఏమో గాని గింగిరాలు కొట్టటం పాము వంతైంది. చేపను మింగలేక.. ఆ చేపను బయటకు ఊసేయలేక పాము అల్లాడింది.. ఈ పామును చూడటానికి జనాలు విపరీతంగా వస్తున్నారు..